Google I/O 2025 తేదీలు వెల్లడి.. ఆండ్రాయిడ్ 16, Gemini పై కీలక ప్రకటనలు వచ్చే ఛాన్స్..!
టెక్ దిగ్గజం గూగుల్ (Google) నుంచి కీలక ప్రకటన వచ్చింది. గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2025 తేదీలను వెల్లడించింది. ఈ ఈవెంట్ రెండు రోజులపాటు జరగనుంది. ఈ ఈవెంట్‌లో అనేక కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16 సహా గూగుల్ ఆర్టిఫిషియల్ చాట్‌బాట్ Gemini పై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అనేక ముఖ్యమైన సమావేశాలు జరగనున్నాయి. గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో ఈ వివరాలు వెల్లడించింది.
భారత్‌లో ఎప్పుడు జరుగుతుంది : ఈ గూగుల్ I/O 2025 ఈవెంట్ మే నెల 20, 21 తేదీల్లో జరగనున్నాయి. భారత్ కాలమానం ప్రకారం 11:30 PM గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ డెవలపర్ కాన్ఫరెన్స్‌కు (Developer Conference) సంబంధించిన రిజిస్ట్రేషన్ లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

కీలక ప్రకటనలు : గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2025 ఈవెంట్.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) సీఈవో సుందర్ పిచాయ్ ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభం కానుంది. ఈ రెండు రోజుల ఈవెంట్‌లో సాఫ్ట్‌వేర్ సహా ఇతర ఉత్పత్తులపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికలు వివరించే ఛాన్స్ ఉంది.
గూగుల్ I/O 2025 ఈవెంట్ లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16 ఫీచర్ ల గురించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు గూగుల్ AI చాట్‌బాట్ Gemini పైనా అప్‌డేట్స్ రానున్నాయి. ఈ ఈవెంట్‌లో Gemini 2.0 AI మోడల్ ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని వివరాలు : గూగుల్ వార్షిక సమావేశంలో ఆండ్రాయిడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్‌డేట్‌లతోపాటు గూగుల్ AI స్టూడియో, ఓపెన్ సోర్స్ Gemma మోడల్, నోట్‌బుక్ LM పై అప్‌డేట్ లు వచ్చే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గత నెలలో స్మార్ట్‌ఫోన్ ల కోసం గూగుల్ సూపర్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా నియంత్రిస్తుంది. ఐడెంటిటీ చెక్ పేరుతో ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ తో డేటా సురక్షితంగా ఉంటుంది.
ఐడెంటిటీ చెక్ ఫీచర్‌లో కొన్ని లొకేషన్‌లను యాడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఈ ఫోన్‌ను ఐడెండిటీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇతర ప్రాంతాల్లో ఫోన్‌ను వినియోగించుకొనేందుకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ అవసరం ఉంటుంది.
తొలిదశలో ఈ ఐటెంటిటీ చెక్ ఫీచర్ గూగుల్ పిక్సల్ మరియు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటు రానుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే గూగుల్ పిక్సల్ ఫోన్‌లకు ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. గూగుల్ పిక్సల్ 6, పిక్సల్ 7, పిక్సల్ 8, పిక్సల్ 9 సిరీస్, పిక్సల్ ఫోల్డ్ ఫోన్‌లలో ఉపయోగించుకోవచ్చు.
వీటితోపాటు OneUI 7 OS పైన పనిచేస్తే శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లకు ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. శాంసంగ్ ఇటీవల గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 OS పైన పనిచేస్తున్నాయి. అందువల్ల ఈ ఫోన్‌లలో ఐడెంటిటీ చెక్ ఫీచర్ పనిచేస్తుంది. త్వరలో మరిన్ని డివైజ్‌లకు అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








