గూగుల్ I/O 2025 : స్మార్ట్ గ్లాసెస్, గూగుల్ బీమ్, ఆండ్రాయిడ్ 16 QPR1 బీటా 1..!
గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో భాగంగా కీలక ప్రకటన వెలువడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గ్లాసెస్‌ను తయారుచేయనున్నట్లు తెలిపింది. రే బాన్ మెటా గ్లాసెస్ కు పోటీనివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ సంస్థల భాగస్వామ్యంతో అనేక వెర్షన్‌ల గ్లాసెస్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సంవత్సరంలో గూగుల్, శాంసంగ్, క్వాల్‌కాం తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
అయితే 2024 చివర్లో శాంసంగ్ ప్రాజెక్ట్ Moohanపేరుతో హెడ్‌సెట్‌ను పరిచయం చేసింది. ఈ హెడ్‌సెట్ ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుందని గూగుల్ తెలిపింది. దీంతోపాటు XR గ్లాసెస్ కోసం శాంసంగ్ తో గూగుల్ తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెరుగైన ఆవిష్కరణల కోసం ఈ రెండింటి భాగస్వామ్యంతో సరైన వేదిక ఉండాలని భావిస్తున్నాయి.

గూగుల్ I/O ఈవెంట్‌లో గూగుల్ జెమిని AI ఆధారిత ఆండ్రాయిడ్ XR ప్లాట్‌ఫాంను ప్రదర్శించింది. ఈ గ్లాసెస్ స్పీకర్‌లు, మైక్రోఫోన్, కెమెరా, ఆప్షనల్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ గ్లాసెస్ మెసేజింగ్, నేవిగేషన్, లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఫొటోగ్రఫీ వంటి అనేక ఆప్లికేషన్‌లను ప్రదర్శించాయి.
గూగుల్ XR గ్లాసెస్‌ను ఎంపిక చేసిన టెస్టర్‌లకు పంపిణి చేస్తోంది. వీరి ద్వారా ఫీడ్‌బ్యాక్‌ను పొందాలని భావిస్తోంది. ఇటీవల విడుదల అయిన Ray Ban Meta స్మార్ట్‌గ్లాసెస్ కెమెరా, మైక్రోఫోన్, స్పీకర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
* ఈ ఈవెంట్ వేదికగా మరిన్ని ప్రకటనలు వచ్చాయి. తన ప్రాజెక్ట్ స్టార్‌లైన్‌ను 3D వీడియో కమ్యూనికేషన్ ప్లాట్‌పామ్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. బీమ్ పేరుతో 2D వీడియో స్ట్రీమ్.. 3D అనుభూతినిచ్చేలా పనిచేస్తుందని చెప్పింది. బీమ్ కోసం తన బ్లాగ్‌లో వివరాలను అందించింది.
వెబ్‌క్యామ్ వేర్వేరు యాంగిల్స్ ద్వారా క్యాప్చర్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా 3D మోడ్ లోకి మారుస్తుంది. గూగుల్ హెడ్ ట్రాకింగ్ సామర్థ్యాలను కూడా ఉపయోగించుకుంటుంది. 2D వీడియో స్ట్రీమ్‌ను 3D లో ఆకట్టుకొనేలా కనిపించేందుకు AI వాల్యూమెట్రిక్ వీడియో మోడల్‌ను ఉపయోగించుకుంటోంది.
గూగుల్ I/O లో ప్రకటించిన ప్రాజెక్ట్ స్టార్‌లైన్‌ను ఈ కొత్త ప్లాట్‌ఫామ్ రీప్లేస్ చేస్తుంది. 3D లో సహజంగా ఉండేలా, కంటిచూపు, కచ్చితమైన ఆడియోలను కలిగి ఉండేలా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్‌లైన్ పూర్తికాకపోయినా.. గూగుల్ బీమ్ 3D వీడియో కమ్యూనికేషన్ ను రూపొందించడానికి ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఉపయోగించారు.
* ఈ గూగుల్ ఈవెంట్‌లో ఆండ్రాయిడ్ 16 QPR1 బీటా 1 కొన్ని గూగుల్ పిక్సల్ ఫోన్‌లకు అందుబాటులోకి వచ్చింది. గత వెర్షన్‌లతో పోలిస్తే అనేక మార్పులు ఉంటాయి. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. డైనమిక్ కలర్ థీమింగ్ ను కలిగి ఉంటుంది. క్విక్ సెట్టింగ్స్ ప్యానల్ కూడా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 16 QPR1 బీటా 1.. గూగుల్ పిక్సల్ 6, పిక్సల్ 6 ప్రో, పిక్సల్ 6a, పిక్సల్ 7, పిక్సల్ 7 ప్రో, పిక్సల్ 7a, పిక్సల్ 8 ప్రో, పిక్సల్ 8a, పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9a, పిక్సల్ ట్యాబ్లెట్‌లు ఈ కొత్త OS వెర్షన్‌ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








