తెలుగు వెబ్‌సైట్ నడిపేవారికి గూగుల్ శుభవార్త,ఎంత రాస్తే అంత డబ్బులు

|

తెలుగులో బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్న వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను ఇకపై తెలుగు వెబ్‌సైట్లకు కూడా అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.దీని ద్వారా రైటర్లు రాస్తే కంటెంట్ ఎంత ఎక్కువమంది యూజర్లకు చేరితే అంత ఎక్కువగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో గూగుల్ ప్రతినిధి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు. గూగుల్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ సదస్సులో మాట్లాడుతూ.. గూగుల్ యాడ్‌సెన్స్ సపోర్ట్‌ను ఇకపై తెలుగు బ్లాగ్‌లు, వెబ్‌సైట్లకు కూడా అందిస్తున్నామని తెలిపారు.

 

రూ.7000లో బెస్ట్ ఫోన్ ఇదే, Karbonn Frames S9 రివ్యూరూ.7000లో బెస్ట్ ఫోన్ ఇదే, Karbonn Frames S9 రివ్యూ

యాడ్‌సెన్స్ అకౌంట్‌

యాడ్‌సెన్స్ అకౌంట్‌

తెలుగులో వెబ్‌సైట్లను రన్ చేసే వారు యాడ్‌సెన్స్ అకౌంట్‌కు సైనప్ అయి అకౌంట్‌ను పొందవచ్చని, దీంతో తమ వెబ్‌సైట్ల ద్వారా వారు ఆదాయాన్ని ఆర్జించవచ్చని అన్నారు.

యాడ్ వర్డ్స్‌కు కూడా తెలుగులో సపోర్ట్‌

యాడ్ వర్డ్స్‌కు కూడా తెలుగులో సపోర్ట్‌

మరోవైపు తమ ఇంకొక ప్రొడక్ట్ అయిన యాడ్ వర్డ్స్‌కు కూడా తెలుగులో సపోర్ట్‌ను అందిస్తున్నామని అన్నారు. దీని వల్ల అడ్వర్టయిజర్లు ప్రాంతీయ వినియోగదారులకు మరింత చేరువై తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, కొత్త అవకాశాలకు ఇది ఊతం ఇస్తుందని తెలిపారు.

నాలుగు భార‌తీయ భాష‌ల‌కు
 

నాలుగు భార‌తీయ భాష‌ల‌కు

ప్ర‌స్తుతం తెలుగుతో క‌లిపి మొత్తం నాలుగు భార‌తీయ భాష‌ల‌కు గూగుల్ యాడ్‌సెన్స్‌, యాడ్ వ‌ర్డ్స్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. హిందీ, బెంగాలీ, త‌మిళం, తెలుగులలో వెబ్‌సైట్ ఓన‌ర్లు యాడ్‌సెన్స్ అకౌంట్ల‌ను సాధించ‌వ‌చ్చు. అలాగే అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు ఆయా భాష‌ల్లో యాడ్స్‌ను ఇచ్చుకోవ‌చ్చు.

అనేక రకాలైన విధాలుగా

అనేక రకాలైన విధాలుగా

ఇప్పటి వరకు తెలుగు వెబ్‌సైట్లకు గూగుల్ యాడ్‌సెన్స్‌కు సపోర్ట్ లేదు. అందువల్ల చాలా మంది అందులో అనేక రకాలైన విధాలుగా గూగుల్ యాడ్స్‌ను పెట్టి నెట్టుకొచ్చారు. 

నేరుగా సపోర్ట్‌

నేరుగా సపోర్ట్‌

అయితే ఇకపై ఆ అవకాశం లేదు. ఇకపై నేరుగా సపోర్ట్‌ను అందిస్తున్నారు కనుక ఇకపై ఏ సమస్యా లేకుండానే గూగుల్ యాడ్‌సెన్స్ యాడ్స్‌ను వెబ్‌సైట్ల ఓనర్లు తమ సైట్లలో పెట్టుకోవచ్చు.

కొన్ని రూల్స్

కొన్ని రూల్స్

ఈ నేఫథ్యంలో గూగుల్ కొన్ని రూల్స్ ని తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ కాపీ చేసేవారిపై కఠిన నిర్ణయం తీసుకోనుంది. 

కాపీ రైట్ ఫిర్యాదు

కాపీ రైట్ ఫిర్యాదు

కొందరు వెబ్‌సైట్ల ఓనర్లు ఇప్పటి వరకు గూగుల్ యాడ్‌సెన్స్‌కు తెలుగు సపోర్ట్ లేనందున కాపీ రైట్ ఫిర్యాదు చేసేందుకు ఎలాగూ వీలుండేది కాదు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుంగా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

యాడ్‌సెన్స్ రద్దు

యాడ్‌సెన్స్ రద్దు

ఇప్పుడు అధికారికంగా తెలుగు భాషకు యాడ్‌సెన్స్ సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి కాపీ చేసిన వారి సైట్లకు యాడ్‌సెన్స్ రద్దు అవుతుంది. 

కంటెంట్‌ను కాపీ చేసే వారు

కంటెంట్‌ను కాపీ చేసే వారు

కనుక ఇకపై తెలుగు సైట్లలో కంటెంట్‌ను కాపీ చేసే వారు ఆ పనిచేసేముందు కొంత ఆలోచిస్తే మంచిది. లేదంటే వెబ్‌సైట్‌కు అనసవరంగా యాడ్‌సెన్స్ యాడ్స్‌ను కోల్పోవాల్సి వస్తుంది.

Best Mobiles in India

English summary
Google India launches Telugu language support for ad products, AdWords and AdSense More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X