గూగుల్ నుంచి అధికారిక తెలుగు టైపింగ్ కీబోర్డ్

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగుకీబోర్డ్‌ను వినియోగించుకోవాలని తహతహలాడుతున్న తెలుగు యూజర్లకు శుభవార్త. Google Inc భారత్‌లోని తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే విధంగా Google Indic Keyboard యాప్‌ను విడుదుల చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను మీ డివైస్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నుంచి అధికారిక తెలుగు టైపింగ్ కీబోర్డ్

ప్రాంతీయ భాషల కోసం గూగుల్ లాంచ్ చేసిన ఇండిక్ కీబోర్డ్ వివిధ ఇన్‌పుట్‌ పద్ధతులను సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్‌లిటరేషన్ మోడ్, నేటివ్ కీబోర్డ్ మోడ్, హ్యాండ్‌ రైటింగ్ మోడ్ (ప్రస్తుతానికి హిందీకి మాత్రమే), టింగ్లిష్ మోడ్ (ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌తో తెలుగు పదాలను పొందటం) వంటి ప్రత్యేకతలు ఈ ఇండిక్ కీబోర్డ్ లేఅవుట్‌లో ఉన్నాయి.

Read More : మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇలా జాగ్రత్త పడండి

Google Indic Keyboard ద్వారా తెలుగు టైపింగ్ ను పొందాలునకునే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు రెండు విధానాల్లో తెలుగును టైప్ చేయవచ్చు. మొదటిది టింగ్లిష్ మోడ్. ఈ ఇన్‌పుట్ మోడ్‌లో namaste అని ఆంగ్లంలో టైప్ చేస్తే నమస్తే అని తెలుగులో కనిపిస్తుంది. ఇది చాలా సులువైన పద్ధితి. మరో ఇన్‌పుట్ మోడ్‌లో భాగంగా డైరెక్ట్ గా తెలుగు కీబోర్డ్ లేవుట్ తో కూడిన కీబోర్డ్ మనకు కనిపిస్తుంది.

English summary
Google Indic Keyboard Allows Telugu Typing on Your Android Phone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting