పనిచేసేందుకు అనువైన కంపెనీలు గూగుల్‌, ఇంటెల్‌

Posted By: Staff

పనిచేసేందుకు అనువైన కంపెనీలు గూగుల్‌, ఇంటెల్‌

ముంబయి : ఈ ఏడాది భారత్‌లో పనిచేసేందుకు అనువుగా ఉన్న అత్యుత్తమ కంపెనీలుగా గూగుల్‌, ఇంటెల్‌, మెక్‌మైట్రిప్‌, మారియట్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లు స్థానం దక్కించుకున్నాయి. గ్రేట్‌ ప్లెస్‌ టు వర్క్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. భారత్‌లోని టాప్‌ 50 కంపెనీల్లో గూగుల్‌ ఇండియా, ఇంటెల్‌ టెక్నాలజీస్‌, మెక్‌మైట్రిప్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇండియా, మారియట్‌ హోటల్స్‌ ఈ ఐదు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయని గ్రేట్‌ ప్లెస్‌ టు వర్క్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఇండియా సీఈవో ప్రసన్‌జీత్‌ భట్టాచార్య చెప్పారు.

గ్రేట్‌ ప్లెస్‌ టు వర్క్‌ ఇన్సిస్టిట్యూట్‌ ప్రపంచవ్యాప్తంగా గత 25 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తోంది. 45 దేశాల్లో తమ సంస్థ అధ్యయనం చేసి మంచి కంపెనీలను ఎంపిక చేస్తుందని ఆయన అన్నారు. ప్రతిసంస్థలో పనిచేసే ఉద్యోగుల తమ యాజమాన్యాల నుంచి ఆశించే విషయానికి వస్తే 2010 నుంచి అవి అలానే కొనసాగుతున్నాయని వారి ఆలోచన సరళిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని భట్టాచార్య పేర్కొన్నారు. చాలా మటుకు కంపెనీలు ఉదాహరణకు మైక్‌మైట్రిప్‌ డాట్‌కామ్‌ కొత్త టాలెంట్‌ను ఎంపిక చేస్తోందని... వారికి 70 శాతం వరకు ఇన్సెంటివ్‌లు ఇస్తోందని చెప్పారు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మహిళా ఉద్యోగులకు ప్రెగ్నెసీ కేర్‌ ప్రోగ్రాంను అమలు చేస్తోంది.

దేశంలోని టాప్‌ 50 కంపెనీలు ప్రధానంగా ముంబయి, ఎన్‌సీఆర్‌, బెంగళూరుపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. అయితే దేశంలోని మిగతా నగరాలు చెనై్న, పూనే, వైజాగ్‌, అహ్మదాబాద్‌, లూధియానాల్లో కూడా తమ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తున్నాయి. టాప్‌ 50 కంపెనీల్లో 38 కంపెనీల్లో 1,000 మంది కంటే కూడా ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తుండగా... 19 కంపెనీల్లో 5,000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 12 కంపెనీలు గత ఏడాది 30 శాతం మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి చేర్చుకున్నారు. ఐదు కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధించారు. 8 కంపెనీల్లోని ఉద్యోగుల్లో 20 శాతం మంది తమ ఉద్యోగాలు మానేసి కొత్త సంస్థల్లో చేరారు. మొత్తానికి చూసుకుంటే టాప్‌ 50 కంపెనీల్లో అతి పెద్ద కంపెనీలతో కలుపుకుంటే సరాసరి మూడో వంతుపైనే ఉద్యోగుల ఇతర కంపెనీలకు వలస వెళ్లినట్లు తెలుస్తోందని భట్టాచార్య అన్నారు.

మొత్తానికి చూసుకుంటే టాప్‌ 50 కంపెనీల్లో ఉద్యోగుల వర్క్‌ కల్చర్‌ బాగా మెరుగుపడింది. పనితో పాటు - వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకునే అవకాశం యాజమాన్యం కల్పించింది. అవసరం అనుకున్నప్పుడు అర్జంటుగా సెలవు కావాల్సినప్పుడు సెలవు తీసుకుని తర్వాత ఆ పని చేసుకునే సదుపాయం అమల్లోకి రావడంతో పాటు మరిన్ని సదుపాయాలు ఉద్యోగులకు లభిస్తున్నాయి. గతంలో ఇలాంటి సదుపాయాలు ఉద్యోగులకు లేవు.యజమాన్యాలు కూడా తమ లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వడంతో పాటు వారికి షేర్లు కూడా అందజేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot