గూగుల్ ఏమి చేస్తుందో తెలియజేసేందుకే ఈ బస్సు: రంజన్

Posted By: Staff

గూగుల్ ఏమి చేస్తుందో తెలియజేసేందుకే ఈ బస్సు: రంజన్

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఏపని చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇటీవల కాలంలో గూగుల్ కంపెనీ ఇండియాలో 'గూగుల్ ఇంటర్నెట్ బస్సు'ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బస్సు ఏమి చేస్తుందని అనుకుంటున్నారా.. యావత్ భారతదేశంలోని ఉన్న పది రాష్ట్రాలలో ప్రయాణించి గూగుల్ యొక్క విశేషాలను, విశిష్టతలను తెలయజేస్తుందన్నమాట. ప్రస్తుతం గూగుల్ ప్రవేశపెట్టని ఈ గూగుల్ ఇంటర్నెట్ బస్సు బీహార్ రాష్ట్ర రాజధాని 'పాట్నా'లో ఉంది.

ఈ సందర్బంలో పియూష్ రంజన్(గూగుల్ ఇండియా మేనేజంగ్ డైరెక్టర్(ఆర్ అండ్ డి)) మాట్లాడుతూ ఈ బస్సుని చూసిన తర్వాత దాదాపు భారతదేశంలో 1.5మిలియన్ జనాభా ఆన్ లైన్ గూగుల్‌ని దర్శించినట్లు తెలిసింది. దేశం మొత్తం మీద 2000 లోకేషన్స్ గుర్తించి వాటిల్లో ఉన్న 120 సిటీలలో ఈ గూగుల్ ఇంటర్నెట్ బస్సుని ప్రయాణించేలా చేస్తారు. ఇప్పటికే ఈ బస్సు దేశంలో పది సిటిలలో ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇప్పడు బీహార్ రాష్టంలో ఉన్న తొమ్మిది ముఖ్యమైన పట్టణాలలో నలభై రోజుల్లో ప్రయాణం చేస్తుంది. ఈ బస్సు ప్రయాణిస్తున్న సిటీలలో ఉన్న జనాభా చాలా ఆసక్తిగా బస్సుని చూసేందుకు వేల సంఖ్యలో రావడం జరుగుతుందని తెలిపారు.

మొట్టమొదటి సారి ఈ 'గూగుల్ ఇంటర్నెట్ బస్సు'ని ఫిబ్రవరి 2009వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ గూగుల్ ఇంటర్నెట్ బస్సులో ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పదుల కొద్ది కంప్యూటర్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బస్సు సహాయంతో దేశంలో పల్లెటూర్లలో ఉన్న ప్రజలకు ఇంటర్నెట్ వల్ల వండర్స్ చేయవచ్చుననే విషయాలను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రజల నుండి మంచి రెప్సాన్స్ రావడంతో పాటు కొత్త విషయాలను తెలుసుకొవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారని పియూష్ రంజన్ తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot