న్యూస్ పేపర్‌లను పరిచయం చేయనున్న గూగుల్..?

Posted By:

 న్యూస్ పేపర్‌లను పరిచయం చేయనున్న గూగుల్..?
గూగుల్ రీడర్ ప్లాట్‌ఫామ్‌ను జూలై 1, 2013 నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్ త్వరలో న్యూస్ పేపర్ అప్లికేషన్ పేరుతో సరికొత్త సర్వీస్‌ను గూగుల్ ప్లేకు పరిచయం చేయనుంది. ఆండ్రాయిడ్ అభిమానులకు ఈ విషయం కాస్త ఊరటే. తమ తాజా న్యూస్ అప్లికేషన్‌తో న్యూస్ రీడర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని గూగుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘న్యూస్ స్టాండ్' పేరుతో యాపిల్ కొత్త న్యూస్ సర్వీస్‌ను యాపిల్ ఇటీవల ప్రారంభించిన నేపధ్యంలో గూగుల్ కొత్త న్యూస్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు సమాయుత్తమవటం మార్కెట్లో హాట్ టాపిక్‌లా మారింది. గూగుల్ ప్రవేశపెట్టబోతున్న ‘గూగుల్ ప్లే న్యూస్' అప్లికేషన్‌ను పొందుగోరే వారు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ వినియోగదారుడై ఉండాలి. ఆండ్రాయిడ్ యూజర్ ఈ అప్లికేషన్ ఆధారంగా తమకు నచ్చిన న్యూస్ ఎడిషన్‌లను నెలలేదా సంవత్సర చందాలను చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. అప్లికేషన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot