ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం గూగుల్ కొత్త ఫీచర్.. అటువంటి లింక్‌లు క్లిక్ చేసినప్పుడు అలెర్ట్ చేస్తుంది..
ఆండ్రాయిడ్ ఫోన్ల భద్రత కోసం గూగుల్ కొత్త సెక్యురిటీ ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. హానికరమైన లింక్‌ల నుంచి యూజర్లకు ఈ ఫీచర్ భద్రత కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ (Android Safe Browing) పేరుతో గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ థర్డ్ పార్టీ యాప్‌లను కూడా సపోర్టు చేస్తుంది.
యూజర్లు ఏవైనా హానికరమైన లింక్లు క్లిక్ చేసినా, వెబ్‌సైట్లలోకి వెళ్లినా ఈ ఫీచర్ వెంటనే అలెర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ పిక్సల్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో గుర్తించినట్లు ఆండ్రాయిడ్ నిపుణుడు మిషల్ రహమన్ తెలిపారు. ఈ ఫీచర్ ఇతర ఫోన్లకు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మిషల్ రహమన్ X పోస్టు ఆధారంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ పేజీ కనిపిస్తోందన్నారు.

ఏయే థర్డ్ పార్టీ యాప్‌లు సపోర్టు చేస్తాయి? : ఈ ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ హానికర లింక్‌ల నుంచి యూజర్లను కాపాడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్‌లో ఏయే థర్డ్ పార్టీ యాప్‌లు సపోర్టు చేస్తాయన్నది తెలియాల్సి ఉంది. రహమాన్ ట్విట్‌లోని ఎటువంటి పేర్లను వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ సేఫ్టీనెట్ సేఫ్ బ్రౌజింగ్ API అనే లైబ్రరీని ఉపయోగిస్తుందని తెలిపారు.
దీనిపై స్పష్టత రావాల్సి ఉంది : రహమాన్ ట్విట్‌లో ఉన్న స్క్రీన్ షాట్‌లో ఉన్న విధంగా Use Live Threat Protection ఆప్షన్ కనిపించింది. సేఫ్ బ్రౌజింగ్‌కు లేటెస్ట్ వెర్షన్ తెలుస్తోంది. ఇలాంటి హానికరమైన లింక్‌లను మరింత కచ్చితత్వంతో పసిగడుతుంది. అయితే ఈ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆన్ ఉంటుందా.. లేదా యూజర్లు ఈ ఫీచర్‌ను ఆన్‌లో పెట్టాల్సి ఉంటుందా తెలియాల్సి ఉంది.
ఈ ఫీచర్ ఎక్కడ కనిపిస్తుందంటే? : ఆండ్రాయిడ్ నిపుణుడు రహమాన్ ట్విట్ ఆధారంగా గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్ యాప్‌లో సేఫ్ బ్రౌజింగ్ పేజీ ఎక్కడ ఉందంటే... సెట్టింగ్స్ > సెక్యురిటీ& ప్రైవసీ > మోర్ సెక్యురిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌లో కనిపించింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లో సెట్టింగ్స్ > సెక్యురిటీ & ప్రైవసీ పేజీ ఆప్షన్‌లో కనిపిస్తుంది.
మరిన్ని వివరాలు ఎప్పుడు : అయితే ఈ ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు. గూగుల్ ప్లే స్టోర్ అప్‌డేట్ ద్వారా త్వరలో అందరికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వచ్చే ముందు ఈ ఫీచర్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








