గూగుల్ ఇండోర్ మ్యాప్స్ ఫీచర్!

|

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ బుధవారం ఇండోర్ మ్యాప్ప్ (Indoor Maps) పేరుతో సిరొకత్త మ్యాపింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఇండోర్ మ్యాపింగ్ సర్వీసులో షాపింగ్ మాల్స్, పర్యాటక స్థలాలు తదితర పబ్లిక్ ప్రాంతాలకు సంబంధించిన లోపలి రూట్ మ్యాపింగ్ వివరాలను పొందపరచటం జరిగింది. గూగుల్ ఇండోర్ మ్యాప్స్ సర్వీసు ఇప్పటికే యూఎస్, జపాన్, సింగపూర్, హాంగ్ కాంగ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.

 
గూగుల్ ఇండోర్ మ్యాప్స్ ఫీచర్!

గూగుల్ తన ఆర్ట్ వ్యూ ప్రాజెక్టులో భాగంగా భారత్‌లోని అన్ని ప్రధాన పబ్లిక్ ప్రాంతాలను కవర్ చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, బోపాల్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, లుదియానా తదితర ప్రముఖ పట్టణాల్లోని షాపింగ్ మాల్స్ ఇంకా పర్యాటక ప్రదేశాల వివరాలను ఇండోర్ మ్యాపింగ్ ఫీచర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండోర్ మ్యాప్ప్ యాప్ వినియోగంలో భాగంగా ఆయా షాపింగ్ మాల్స్ ఇంకా పర్యాటక ప్రాంతాలకు సంబంధించి లోపలి భాగాలను జూమ్ చేసుకుని వీక్షించే అవకాశాన్ని కల్పించారు.

 

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది. గూగుల్ తన స్ట్రీట్ వ్యూ సర్వీసును భారత్ లో జూన్ 2011లో ప్రారంభించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X