'గూగుల్ ప్లస్' కోసం కొత్త 'బ్యాడ్జెస్‌'ని విడుదల చేసిన 'గూగుల్'

Posted By: Staff

 'గూగుల్ ప్లస్' కోసం కొత్త 'బ్యాడ్జెస్‌'ని విడుదల చేసిన 'గూగుల్'

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్ ప్లస్‌లో యూజర్ ప్రొపైల్స్, పేజీలను ప్రమోట్ చేసుకునేందుకు గాను సోషల్ మీడియా బ్యాడ్జెస్‌ ఎంతలా సహాయపడతాయో అందరికి తెలిసిన విషయమే. దీనిని దృష్టిలో పెట్టుకోని యూజర్స్ ఎక్కువ సేపు గూగుల్ ప్లస్ పేజీలలో ఉండేందుకు గాను, సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్త ఆప్షన్స్‌ని 'గూగుల్ బ్యాడ్జెస్' కోసం విడుదల చేసింది.

ఈ గూగుల్ బ్యాడ్జెస్ ద్వారా చక్కని బ్యాక్ గ్రౌండ్ డార్క్ కలర్స్‌ని అనుకూలపరచవచ్చు. ఈ బ్యాడ్జెస్‌లో గూగుల్ ప్లస్ బటన్‌ని నిక్షిప్తం చేయడం ద్వారా, మీ పేజిలలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో గమనించవచ్చు. ప్రస్తుతం గూగుల్ ఈ ఆఫ్షన్స్‌ని డెవలపర్స్ కోసం సిద్దం చేసింది. రాబోయే కాలంలో వీటిని యూజర్స్ కు అందించనుంది.

ఈ సందర్బంలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కంటెంట్‌ని ఏవిధంగా గూగుల్ బ్యాడ్జెస్‌ని ఉపయోగించి షేర్ చేయవచ్చో వివరించింది. గూగుల్ ఈ గూగుల్ ప్లస్ బ్యాడ్జెస్‌ని రూపొందించడానికి గల కారణం ప్రపంచంలో టాప్ సైట్స్‌గా వెలుగొందుతున్న వెబ్ సైట్స్ ఈ బ్యాడ్జెస్ వల్లనే ఎక్కువ యూజర్స్‌ని రాబట్టుకుంటున్నాయని తెలిపింది.

గూగుల్ బ్యాడ్జెస్‌ని షేర్ చేసే విధానాలు: మీ వెబ్‌సైట్ బ్యాడ్జ్ సందర్శకులు చేర్చుకున్నప్పుడు మీ గూగుల్ ప్లస్ పేజీకి కనుగొనడంలో మరియు వివిధ పద్ధతులలో కనెక్ట్ చేయవచ్చు. అవి ఏమిటంటే స్నేహితులను చూడడం, వారి వృత్తాలు మీ వెబ్‌సైట్‌లో భాగస్వామ్యం, మీ గూగుల్ ప్లస్ పేజీ, ప్లస్ వన్ సైట్ అనుసరించడం లాంటివన్నమాట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot