Twitter, Instagram లాగా Gmail కు కూడా ' బ్లూ టిక్' ! ఎందుకు, ఎలా పనిచేస్తుంది?
ట్విట్టర్ యొక్క బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్ లాగానే, గూగుల్ కూడా వినియోగదారుల గుర్తింపును ధృవీకరించడానికి మరియు ఆన్లైన్ స్కామ్‌లను తగ్గించడానికి, ఇమెయిల్ పంపినవారి పేరు పక్కన బ్లూ చెక్‌మార్క్‌ను తీసుకువస్తుందని ప్రకటించింది, ఇది ప్రస్తుతానికి ఉచితంగా అందించబడుతుంది.
2021లో గూగుల్ కంపెనీ Gmailలో మెసేజ్ ఐడెంటిఫికేషన్ కోసం బ్రాండ్ సూచికలను (BIMI) పరిచయం చేసింది. ఇది ఇమెయిల్‌లలో బ్రాండ్ లోగోను అవతార్‌గా చూపించాలంటే పంపినవారు బలమైన ద్రువీకరణను ఉపయోగించాలి మరియు వారి బ్రాండ్ యొక్క లోగోను ధృవీకరించాలి.

గూగుల్ యెక్క అధికారిక ప్రకటనలో, కంపెనీ ఇలా చెప్పింది: "ఆ ఫీచర్‌పై ఆధారపడి, వినియోగదారులు ఇప్పుడు BIMI వ్యవస్థని స్వీకరించిన వారు వారి జిమెయిల్ లో మెసేజ్ పంపినవారి కోసం చెక్‌మార్క్ గుర్తుని చూస్తారు. ఇది వినియోగదారులకు నిజమైన మెసెజ్ లు మరియు మోసగాళ్లు నుండి సందేశాలను గుర్తించడంలో సహాయపడుతుంది."
ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇది, ఇప్పుడు గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్‌లు, లెగసీ G సూట్ బేసిక్ మరియు బిజినెస్ కస్టమర్‌లు, ఇంకా, వ్యక్తిగత గూగుల్ ఖాతాలు ఉన్న యూజర్‌లకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ BIMI వ్యవస్థని స్వీకరించిన కంపెనీలు కూడా ఆటోమేటిక్‌గా చెక్‌మార్క్‌ను పొందుతాయి.
ఇంకా, టెక్ దిగ్గజం గూగుల్ ఒక ప్రకటన ద్వారా తెలియచేస్తూ "బలమైన ఇమెయిల్ వెరిఫికేషన్ వినియోగదారులకు మరియు ఇమెయిల్ భద్రతా వ్యవస్థలలో స్పామ్ లను గుర్తించడానికి మరియు మోసగాళ్లను ఆపడానికి సహాయపడుతుంది అని మరియు పంపేవారికి వారి బ్రాండ్ యెక్క నమ్మకాన్ని ప్రభావితం చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది." అని వివరించింది.
ఇంకా, "ఇది ఇమెయిల్ సోర్స్ పై విశ్వాసాన్ని పెంచుతుంది మరియు పాఠకులకు లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ మెరుగైన ఇమెయిల్ వ్యవస్థను సృష్టిస్తుంది."
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత, తన ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని లెగసీ బ్లూ బ్యాడ్జ్‌లను తీసివేసిన సంగతి మీకు తెలిసిందే, తర్వాత ఇప్పుడు గూగుల్ బ్లూ చెక్ మార్క్ ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్విట్టర్ లో ఇప్పుడు ఈ బ్లూ టిక్‌ల కోసం వ్యక్తిగత వినియోగదారుల నుండి నెలకు రూ. 900 (సంవత్సరానికి రూ. 9,400) మరియు గోల్డ్ టిక్‌ల కోసం సంస్థల నుండి $1,000 వసూలు చేస్తోంది.
ఇదే విధంగా మెటా వెబ్‌లో కూడా నెలకు $11.99 మరియు మొబైల్‌లో నెలకు $14.99 చొప్పున ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ కోసం చెల్లింపు ధృవీకరణను పరీక్షిస్తోందని వార్తలు వస్తున్నాయి.
నివేదికలలో ప్రకటించినట్లు "మెటా వెరిఫైడ్" ఖాతా వినియోగదారులకు ధృవీకరించబడిన బ్యాడ్జ్‌ను మంజూరు చేస్తుందని మెటా యొక్క CEO మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు, ఇది ప్లాట్‌ఫారమ్‌లలో విజిబిలిటీని పెంచుతుంది, ప్రాధాన్యత గల కస్టమర్ మద్దతు మరియు మరిన్ని ఫీచర్లను మెరుగుపరుస్తుంది అని తెలిపారు.
గూగుల్ యెక్క ఈ ఫీచర్ రాపిడ్ రిలీజ్ మరియు షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్‌లలో భాగంగా అమలు చేయబడింది మరియు మూడు రోజుల్లో ప్రధాన వ్యాపారాలకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్, లెగసీ G సూట్ బేసిక్ మరియు బిజినెస్ కస్టమర్ మరియు వ్యక్తిగత గూగుల్ ఖాతా ఉన్న వినియోగదారులు కూడా బ్లూ చెక్‌మార్క్ పొందడానికి అర్హులని గూగుల్ నిర్ధారించింది.


Click it and Unblock the Notifications