గూగుల్ స్కాలర్‌షిప్ , లక్షా 30 వేల మందికి శిక్షణ..

Written By:

ఇండియాలో టెక్ దిగ్గజాలను తయారుచేయాలనే లక్ష్యంగా గూగుల్ ముందుకొస్తోంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ యువతను తయారుచేసేందుకు స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్ పెట్టింది. ఈ ప్రొగ్రామ్ ద్వారా అత్యాధునిక కోర్సులలో విధ్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.

టీవీ కొంటున్నారా? అయితే టిప్స్ మీ కోసం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యాధునిక రంగాల్లో శిక్షణ

విద్యార్థులకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీతో కలిసి గూగుల్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

లక్షా 30వేల మంది డెవలపర్లకు..

ఈ భాగస్వామ్యంలో భాగంగా కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌తో లక్షా 30వేల మంది డెవలపర్లకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను..

ఈ కార్యక్రమంలో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను అందించనుంది.

భారతీయ విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక విద్యను ..

ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా భారతీయ విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వర్చ్యూవల్‌ రియాల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది.

భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను..

ఈ కొత్త స్కాలర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ ద్వారా భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్‌ ముందుకు వచ్చింది. 

రానున్న మూడేళ్లలో..

కాగా రానున్న మూడేళ్లలో దేశంలో కొత్తగా 20 లక్షల మంది ఆండ్రాయిడ్‌ డెవలపర్లకు గూగుల్‌ శిక్షణ ఇస్తుందని సీఈవో సుందర్‌ పిచాయ్‌ 2015లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

జవాబులు చెప్పండి

జవాబులు చెప్పండి.. గూగుల్ జాబ్ కొట్టండి. ప్రశ్నల కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google introduces scholarship to prepare 1.3 lakh Indians for cloud tech, AI and more more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot