ఫ్రీ ఇంటర్నెట్, ఇండియాకి గూగుల్ వరాల జల్లులు

Written By:

భారత పర్యటనకు విచ్చేసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వరాల జల్లులను ప్రకటించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు బంఫరాఫర్లను ప్రకటించారు. డీల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ అనేక విషయాలను ఇండియన్లతో షేర్ చేసుకున్నారు. సుందర్ పిచాయ్ మాటల్లోని హైలెట్స్ పై ఓ లుక్కేయండి.

సుందర్ పిచాయ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి

గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి నేను ఇండియాకి వచ్చానని గూగుల్ సీఈఓ తెలిపారు. అంతేకాకుండా గూగుల్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

భారతదేశంలో 40 నగరాల్లో

ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబోయే మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భారతదేశం సమస్యలను అధిగమిస్తే ప్రపంచానికే పరిష్కారాలు చూపిస్తుందని తెలిపారు.

అందరికీ ఉచిత ఇంటర్నెట్

దీంతో పాటు అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు. దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

ఇంటర్నెట్ ద్వారా

ఇంటర్నెట్ ద్వారా ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని, అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్‌సైట్ సృష్టించుకోవచ్చన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు.

 

 

గూగుల్ సీక్రెట్ ప్రాజెక్టులు

గూగుల్ రహస్యంగా కొన్ని ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google introduces tools for small businesses in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot