ఆ ప్రాంతంలో గూగుల్ అంతుచిక్కని ప్రాజెక్ట్..?
న్యూ మెక్సికోలోని స్పేస్‌కోర్ట్ ప్రాంతంలో గూగుల్ ఓ అంతుచిక్కని రేడియో ట్రాన్స్‌మిటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయోగాత్మక ట్రాన్స్‌మిటర్ నిర్మాణానికి సంబంధించి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్‌ను గూగుల్ అనుమతి కోరినట్లు తెలియవచ్చింది. ఈ లైసెన్స్ అప్లికేషన్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Read More : వాట్సాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఈ అంతుచిక్కని రేడియో ట్రాన్స్‌మిటర్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బెలూన్స్ అలానే సోటార్ డ్రోన్‌లకు ఇంటర్నెట్‌ను సమకూర్చేందుకు ఈ ట్రాన్స్‌మిటర్‌ను గూగుల్ ఉపయోగించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్ అధికారికంగా ఏ విధమైన వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.
Read More : గూగుల్ చావును జయించబోతోందా...?


Click it and Unblock the Notifications








