గూగుల్ ఆ ఫీచర్‌ను షట్‌డౌన్ చేసింది, డేటా డౌన్‌లోడ్‌కి ఆఖరి గడువు ఇదే

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ https://goo.gl/ యూఆర్‌ఎల్ షార్టెనర్ సేవలను నిలిపివేయనుంది. 2019, మార్చి 30 నుంచి ఈ సేవలు నిలిపివేయబడతాయని ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీసులను గూగుల్ 2009లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయొిడ్ , ఐఓఎస్ లలో ఈ ఫీచర్ యూజర్లకు లభిస్తోంది. అయితే ఇప్పుడు ఆసక్తికర నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 13, 2018 నుంచి కేవలం existing యూజర్లు మాత్రమే ఈ సేవలను వాడుకునేందుకు వీలు కలుగుతుందని గూగుల్ వెల్లడించింది. ఇక వారు 2019, మార్చి 30 వరకు సేవలను వాడుకోవచ్చని, ఆ సమయంలోగా తాము క్రియేట్ చేసుకున్న షార్ట్ లింక్స్ డేటాను వారు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. గడువు తేదీ ముగిశాక యూఆర్‌ఎల్ షార్టెనర్ సేవలను ఎవరూ వాడుకోలేరని, కాకపోతే అంతకు ముందు వరకు క్రియేట్ చేసుకున్న షార్ట్ లింక్స్ మాత్రం పనిచేస్తాయని గూగుల్ వెల్లడించింది.

JioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌లో ఈ పదాలు టైప్ చేస్తే నవ్వులే నవ్వులు

ప్లిప్ ఏ కాయిన్ ( Flip A Coin)

ఈ పదం టైపు చేస్తే మీకు ఇలా దర్శనమిస్తుంది. ఫ్లిప్ ఇట్ అని దీన్ని చూపిస్తుంది కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి.

రోల్ ఏ డైస్ ( Roll A Dice)

దీన్ని మీరు టైపు చేసి చూస్తే నాలుగు నంబర్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది.

ఆస్క్యూ ( Askew)

ఈ పదాన్ని మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే చిత్ర విచిత్రమైన సైట్లు వస్తాయి.

జెర్గ్ రష్ ( Zerg Rush )

ఈ పదం మీరు గూగుల్ లో వెతికారంటే అది ఏం చూపిస్తుందో తెలియక తలలు పట్టుకుంగారు మీరు. అన్నీ సున్నాలు వచ్చి కంటెంట్ చెరిపేస్తూ పోతుంటాయి.

అటారీ బ్రేక్ అవుట్ ( Atari Breakout)

ఈ పదాన్ని మీరు గూగుల్ లో టైపు చేశారనుకోండి. మీకు ఓ క్లాసిక్ ఆట కనిపిస్తుంది.

గూగుల్ పేస్ మ్యాన్ ( Google Pacman )

ఈ పదం టైపు చేస్తే మీకు ఏవో లైట్లు వచ్చి క్లిక్ టూ ప్లే అంటూ వస్తుంది. మరి దీని అర్థం ఏంటో దాని అర్థం ఏంటో తెలియక తలలు గోక్కోవాల్సిందే.

గూగుల్ గ్రేవిటీ ( Google Gravity )

ఈ పదం టైపు చేస్తే మీ డెస్క్ టాప్ మీద గూగుల్ పై నుంచి కిందకు వచ్చి అనేక రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.

Do A Barrel Roll

ఇది టైపు చూస్తే మీ డెస్క్ టాప్ గిర్రున తిరుగుతుంది మరి.
గూగుల్ ఆర్బిట్ ( Google Orbit)
దీన్ని టైపు చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అదేంటో కూడా అర్థం కాదు.

Offline Dinosaur Game
ఇంటర్నెట్ బంద్ అయినప్పుడు మీకు ఓ కోడిపెట్ట టింగు టింగును ఎగురుతుంటుంది. ఇంటర్నెట్ వచ్చే దాకా అది కాలక్షేపానికి మీరు ఆడుకునే గేమ్ అన్నమాట.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google shutting down goo.gl URL shortener next year, existing links will keep working More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot