గూగుల్‌ హిట్.. ట్విట్టర్ ఫట్

By Hazarath
|

ప్రపంచంలో పనిచేయడానికి అత్యంత అనువైన అంతర్జాతీయ సంస్థల జాబితాలో గూగుల్‌కు మరోసారి అగ్రస్థానం దక్కింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజానికి ఈ లిస్ట్‌లో నంబర్‌వన్ స్థానం లభించడం వరుసగా ఇది మూడో ఏడాది. అలాగే ట్విట్టర్ తన కంపెనీ ఉద్యోగులకు రాంరాం చెప్పింది. దాదాపు 336 మంది ఉద్యోగులను కంపెనీకి బైబై చెప్పమంటోంది. ఇక ఇన్పోసిస్ దాదాపు 2 వేల మందికి ప్రమోషన్లు కల్పించింది. అలాగే కొత్తగా 20 వేల మందిని ఉద్యోగంలోకి తీసుకుంటుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. వీటన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more : Google.comను రూ.785కు కొనేసాడు..!

ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల జాబితాలో..

ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల జాబితాలో..

ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎస్‌ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, తయారీ కంపెనీ వీ ఎల్ గోరే వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్'

గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్'

ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్' రూపొందించిన ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్‌ప్లేసెస్' జాబితాలో ఈ విషయం వెల్లడైంది.

డాటా స్టోరేజ్ స్పెషలిస్ట్ నెట్‌యాప్..
 

డాటా స్టోరేజ్ స్పెషలిస్ట్ నెట్‌యాప్..

డాటా స్టోరేజ్ స్పెషలిస్ట్ నెట్‌యాప్, మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్ టెలిఫొనికా కంపెనీలు వరుసగా నాలుగు, ఐదో స్థానాలను కైవసం చేసుకున్నాయి.

మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో..

మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో..

ఈఎంసీ కార్పొరేషన్ 6వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, బీబీవీఏ 8వ స్థానంలో, మోన్‌శాంటో 9వ స్థానంలో, అమెరికా ఎక్స్‌ప్రెస్ 10వ స్థానంలో ఉన్నాయి.

ట్వీటర్ 336 మంది ఉద్యోగులను ..

ట్వీటర్ 336 మంది ఉద్యోగులను ..

ఇక ఇదిలా ఉంటే మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్వీటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లో మొత్తం 4,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా..

కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా..

ఇందులో తొలగిస్తున్న ఉద్యోగులు 8%గా ఉన్నారు. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్వీటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో..

ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో..

ప్రస్తుతం ట్వీటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్వీటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. వ్యయాలను తగ్గించుకోవడం వల్ల లాభాలు పెరగొచ్చు కానీ అదే సమయంలో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడటం, కం పెనీ భవిష్యత్తు వంటి తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

2 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు

2 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు

ఇక ఇన్ఫోసిస్ తన సంస్థలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది. ప్రమోషన్లతో పాటు వారికి చెల్లించే వేతనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇది 80 శాతం నుండి 100 శాతం వరకు ఉంటుందని సంస్థ చెబుతోంది.

ఈ సంవత్సరం మొత్తం మీద 4,711 మందికి ప్రమోషన్లు

ఈ సంవత్సరం మొత్తం మీద 4,711 మందికి ప్రమోషన్లు

ఈ సంవత్సరం మొత్తం మీద 4,711 మందికి ప్రమోషన్లు కల్పించినట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రమోషన్ పొందిన వారిలో 2067 మందికి ఉన్నత స్థాయిలో ప్రమోషన్లు కల్పించారు. 14.1 శాతం మంది ఉద్యోగులు సంస్థను వీడటంతో అనుభవజ్ఙులను అంటిపెట్టుకునే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 20 వేల మందిని ఉద్యోగంలోకి..

క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 20 వేల మందిని ఉద్యోగంలోకి..

ఇక క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా 20 వేల మందిని ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు కంపెనీ చెబుతోంది. వీరికి దాదాపు రూ. 3.25 లక్షల ప్రారంభ వేతనం ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగుల స్టైఫండ్ ను రూ. 4 వేల నుంచి 6 వేల వరకు పెంచుతున్నామని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి..https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Google is the best company to work for, third year in a row

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X