2011 టాప్ వెబ్‌సైట్ గూగులే..!

Posted By:

2011 టాప్ వెబ్‌సైట్ గూగులే..!

 

సంవత్సరం ముగుస్తుంది అంటే చాలు ఆ సంవత్సరంలో ఏది బెస్ట్..  ఏది సూపర్ హిట్ అంటూ గందర గోళాలు సృష్టిస్తుంటారు. అదే విధంగా 2011వ సంవత్సరానికి గాను ప్రపంచంలో ఎక్కువ మంది దర్శించిన వెబ్‌సైట్‌గా గూగుల్ మొదటి స్దానాన్ని దక్కించుకోగా, రెండవ స్దానాన్ని ఎక్కువ మంది యూజర్స్ కలిగిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్  ఫేస్‌బుక్ సొంతం చేసుకుందని ప్రముఖ సర్వే సంస్ద నీల్సన్ నిర్వహించిన సర్వేలో ప్రకటించింది.

నీల్సన్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రకారం ఒక్క నెలలో గూగుల్ వెబ్‌సైట్‌ని 153 మిలియన్ సందర్శకులు సందర్శించగా, అదే ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ని 138 మిలియన్ సందర్శకులు సందర్శించినట్లు తెలిపారు. 130 మిలియన్ సందర్శకులు సందర్శించిన యాహూ కంపెనీ మూడవ స్దానంలో ఉంది. ఇటీవల కాలంలో యంగస్టర్స్ యాహూ మెయిల్‌ని విస్మరించడం వల్ల యాహూ మూడవ స్దానానికి చేరిందని సమాచారం.

జనవరి నుండి అక్టోబర్ 2011 వరకు సేకరించిన సమాచారాన్ని బట్టి నీల్సన్ సర్వే ఓ కధనంగా ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ఎవరెవరైతే తమ యొక్క ఇళ్లు, ఆఫీసుల నుండి కూడా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారో వారిని కూడా ఈ సర్వేలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రపంచం మొత్తం మీద ఈ సర్వేలో 200,000 మంది జనాభా పాల్గోన్నారు.

ఇది ఇలా ఉంటే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ మొదటి ర్యాంక్‌ని సంపాదించుకోగా, గూగుల్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ మాత్రం ఎనిమిదవ స్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గూగుల్ ప్లస్‌ని వేరే ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్, బ్లాగ్స్‌తో పోల్చితే సరాసరి సందర్శకులు నెలకు 8.02మిలియన్లుగా ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot