గూగుల్ నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టం

|

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత డివైస్‌లను సపోర్ట్ చేసే విధంగా 'ఆండ్రాయిడ్ థింగ్స్ 1.0' పేరుతో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం ఐఓటీ ఆధారిత డివైస్‌లను క్రియేట్ చేసేందుకు తోడ్పడటంతో పాటు వాటికి గూగుల్ అసిస్టెంట్ ఇంకా గూగుల్ కాస్ట్ వంటి సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్‌లను కల్పిస్తుంది. తక్కువ పవర్‌ను ఖర్చు చేసే విధంగా ఆప్టిమైజ్ చేయబడిన ఈ ఆపరేటింగ్ సిస్టం i.MX8M, Qualcomm SDA212, Qualcomm SDA624, MediaTek MT8516 NXP మాడ్యుల్స్‌ను సపోర్ట్ చేయగలుగుతుందని గూగుల్ వెల్లడించింది. ఇదే సమయంలో Raspberry Pi 3, NXP i.MX7D వంటి ప్రోటోటైప్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయగలుగుతుందట.

 

రెడ్‌మి,శాంసంగ్ ఫోన్లకు ఊహించని షాకిచ్చిన Realme 1రెడ్‌మి,శాంసంగ్ ఫోన్లకు ఊహించని షాకిచ్చిన Realme 1

మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్..

మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్..

ఆండ్రాయిడ్ థింగ్స్ 1.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ఇంకా స్టెబిలిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ థింగ్స్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి ఐఓఎస్ ఆధారిత డివైస్ లను ఎల్ జీ, లెనోవో, జేబీఎల్ వంటి సంస్థలు మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి.

మరికొద్ది సంవత్సరాల్లో సాకారం..

మరికొద్ది సంవత్సరాల్లో సాకారం..

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కే దక్కింది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది. మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..?

యంత్రాలన్నీ ఒక నెట్‌వర్క్‌ పై...
 

యంత్రాలన్నీ ఒక నెట్‌వర్క్‌ పై...

మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.

2020 నాటికల్లా పూర్తిస్థాయిలో...

2020 నాటికల్లా పూర్తిస్థాయిలో...

మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి రకరకాల పనులను ఖచ్చితమైన సమయపాలతో వాటి వాటి మేధస్సును ఉపయోగించి సమర్థవంతంగా పూర్తి చేసేస్తాయి. 2020 నాటికల్లా ఐఓటీ పరిధి మరింత విస్తరించి అందులో ఉపకరణాల సంఖ్య 20 వేల కోట్లకు చేరుకుంటుదని ఓ అంచనా.

 

 

Best Mobiles in India

English summary
We all know very well that the Internet of Things (IoT) market is constantly expanding and the tech giant Google does not want to be left behind in this race. Hence, now according to the latest reports, the tech giant Google just launched a new operating system which is based on Android.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X