ఎలక్ట్రిక్‌ ఉపకరణాల రంగంలోకి అడుగుపెట్టనున్న గూగుల్

Posted By: Staff

ఎలక్ట్రిక్‌ ఉపకరణాల రంగంలోకి అడుగుపెట్టనున్న గూగుల్

ఇంటర్నెట్‌ సెర్చి ఇంజిన్‌ కంపెనీ గూగుల్‌ ఎలక్ట్రిక్‌ ఉపకరణాల రంగంలోకి అడుగుపెట్టనుంది. బల్బ్‌లు, థర్మోస్టాట్స్‌, డిష్‌వాషర్లను తయారు చేయనుంది. వైర్‌లెస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అనుసంధానం చేయనుంది. ఈ ఏడాది చివరికి దాదాపు అన్ని రకాల ఎలక్ట్రిక్‌ గృహ ఉపకరణాలను విడుదల చేయనుందని 'ద డైలీ టెలిగ్రాఫ్‌' పత్రిక వెల్లడించింది. ట్యాబ్లెట్‌ కంప్యూటర్లతో వీటిని అనుసంధానం చేయడానికి వైర్‌లెస్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. 'ప్రాజెక్ట్‌ టంగస్టన్‌' పేరుతో కొత్త విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల సమావేశంలో గూగుల్‌ ప్రకటించింది. సమావేశంలో తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ Android@home ను ఉపయోగించి ట్యాబ్లెట్‌ ద్వారా లైట్లను ఆన్‌ చేయడం, ఆఫ్‌ చేయడాన్ని కంపెనీ ప్రదర్శించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot