'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లోకి కొత్తగా చేరిన ధాయ్‌లాండ్

Posted By: Super

'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లోకి కొత్తగా చేరిన ధాయ్‌లాండ్

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ టూరిజమ్ అధారిటీ ఆఫ్ ధాయ్‌లాండ్‌తో కలసి ధాయ్‌లాండ్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ధాయ్‌లాండ్ గూగుల్ కంట్రీ మేనేజర్ ఆరియా పనోమ్‌యంగ్ వెల్లడించారు. ప్రపంచంలో టూరిజమ్ ఎక్కువగా ఉన్న దేశాలలో ధాయ్‌లాండ్ ఒకటి. టూరిస్టులకు అనుగుణంగా దేశంలోని ముఖ్య ప్రాంతాలను గూగుల్ స్ట్రీట్ వ్యూకి అనుసంధానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం స్ట్రీట్ వ్యూ టీమ్ ఎవరైత్ ఉన్నారో వారు రెండు లేదా మూడు సంవత్సరాల పాటు ధాయ్‌లాండ్ వీధులను క్షుణ్ణంగా పరిశీలించి డేటాని కలెక్ట్ చెయ్యడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని థాయ్ లాండ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ మ్యాప్స్‌కి ఉపయోగించడం జరుగుతుంది. టూరిజన్ ఆధారిటీ ఆప్ థాయ్ లాండ్ దేశంలో ఉన్న ముఖ్యైమైన ఆర్గనైజేషన్స్‌ని, ఫేవరేట్ టూరిస్ట్ ప్లేసులను గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటుంది.

గూగుల్ టీమ్ కూడా థాయ్ లాండ్‌ లో ఉన్న మోస్ట్ పాపులర్ వీధులను, స్దలాలను స్ట్రీట్ వ్యూ ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఇలా గూగుల్ స్ట్రీట్ వ్యూలో ధాయ్‌లాండ్ ఉంచడం వెనుక టూరిజమ్ అధారిటీ ఆఫ్ ధాయ్‌లాండ్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ధాయ్‌లాండ్ ప్రపంచంలో జాతీయంగా, అంతర్జాతీయంగా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా చిత్రీకరించడమేనని తెలియజేశారు. ఈ సందర్బంలో టూరిజమ్ అధారిటీ ఆఫ్ ధాయ్‌లాండ్ గవర్నర్ మాట్లాడుతూ గూగుల్ పాట్నర్ షిప్‌తో థాయ్ లాండ్ టూరిస్ట్ రంగం బాగా అభివృద్ది చెందుతుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot