మొన్న ఫ్లయిట్స్, రేపు ఆన్ లైన్ మ్యూజిక్ స్టోర్

Posted By: Staff

మొన్న ఫ్లయిట్స్, రేపు ఆన్ లైన్ మ్యూజిక్ స్టోర్

సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్తగా ఆన్ లైన్ మ్యూజిక్ స్టోర్‌ని ప్రారంభించనుంది. ఈ ఆన్ లైన్ మ్యూజిక్ స్టోర్‌ని ప్రారంభించడంతో గూగుల్ ప్రముఖ ఆన్ లైన్ మ్యూజిక్ కంపెనీలైన అమెజాన్, యాపిల్‌‌లకు పోటీగా నిలవనుంది. ఇంటర్నెట్లో వచ్చిన రూమర్స్ ప్రకారం గూగుల్ కొత్తగా ప్రారంభించిన స్టోర్‌లలో MP3 మ్యూజిక్‌ని డౌన్ లోడ్ చేసుకొవడంతో పాటు, డివైజెస్‌లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌లను అందించనుందని సమాచారం.

న్యూయార్క్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ మ్యూజిక్ స్టోర్‌ని ప్రారంభించడానికి గాను ప్రస్తుతం మ్యూజిక్ పబ్లిషర్స్, రికార్డింగ్ లేబుల్స్ వారితో బిజినెస్ చర్చలు జరుగుతన్నాయని ప్రకటించింది. ఈ చర్చలు అనంతరంలో రానున్న కొన్నివారాల్లో ఈ గూగుల్ మ్యూజిక్ స్టోర్‌ని ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం మే నెలలో గూగుల్ విడుదల చేసిన 'మ్యూజిక్ బీటా'కి దీనిని అనుసంధానం చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ మ్యూజిక్ స్టోర్ ద్వారా ఎవరైతే అమెరికా ఆధారిత యూజర్స్ ఉన్నోరా వారందరూ మ్యూజిక్‌ని ఆన్ ద్వారా పర్సనల్ ల్యాప్ టాప్స్, మొబైల్స్, టాబ్లెట్స్ లాంటి వాటలోకి డౌన్ లోడ్ చేసుకొవచ్చు. ఇలా గూగుల్ రోజురోజుకీ దేదీప్యమానంగా వెలుగుతూ పోతుంది. గూగుల్ ఈ మ్యూజిక్ ఆన్ లైన్ స్టోర్ గురించి కామెంట్ చేయకపోవడానికి కారణం సెర్చ్ ఇంజన్ రేంజి నుండి అన్ని రకాల యూజర్ అవసరాలు తీర్చే విధంగా గూగుల్ ఎదుతుండడం చూసి, కొంత మంది ఓర్వలేకపోతున్నారని దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సెర్చ్ ఇంజన్ గూగుల్ నుండి డైరెక్టుగా విమానాల టిక్కెట్స్ బుక్ చేసుకునేందుకు గాను పోయిన నెలలో గూగుల్ ప్లయిట్స్(http://www.google.com/flights/) ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot