భారత్‌లో క్రోమ్ డివైస్‌లను ఆవిష్కరించిన గూగుల్

Posted By:

విద్యా, వ్యాపార విభాగాలను టార్గెట్ చూస్తూ గూగుల్ ఇండియా కొత్త శ్రేణి క్రోమ్‌బుక్‌లతో పాటు క్రోమ్‌ బాక్స్‌ను మార్కెట్లో పరిచయం చేసింది. ఏడాది క్రితం ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటి క్రోమ్‌బుక్‌ను పరిచయం చేసిన గూగుల్ తాజాగా మూడు కొత్త శ్రేణి క్రోమ్‌ బుక్‌లను విడుదల చేసింది. గూగుల్ విడుదల చేసిన మూడు క్రోమ్ బుక్‌లలో రెండు క్రోమ్ బుక్‌లను జోలో, నెక్సియన్ కంపెనీలు అందిస్తున్నాయి. ధర రూ.12,999. ఈ రెండు క్రోమ్ డివైస్‌లను అమెజాన్, స్నాప్‌డీల్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి.

భారత్‌లో క్రోమ్ డివైస్‌లను ఆవిష్కరించిన గూగుల్

మరో క్రోమ్ బుక్‌ను అసుస్ మరికొద్ది నెలల్లో విడుదల చేయనుంది. మరోవైపు బిజెనెస్ వర్గాలను టార్గెట్ చూస్తూ గూగుల్ క్రోమ్‌బాక్స్‌ను విడుదల చేసింది. ఈ ప్యాకేజీ ధర రూ.90,000.

భారత్‌లో క్రోమ్ డివైస్‌లను ఆవిష్కరించిన గూగుల్

గూగుల్ క్రోమ్ బాక్సులో ఒక హైడెఫినిషన్ కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. దీంతో పాటు మానిటర్ కూడా అవసరమవుతుంది. ఈ బాక్స్ ద్వారా వీడియో కాన్ఫిరెన్సింగ్ నిర్వహించుకోవచ్చు. ఇందులో ఒకేసారి 15 మంది వేర్వేరు ప్రాంతాల నుంచి చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లను అనుసంధానించుకోవచ్చు.

(ఇంకా చదవండి: సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే 10 కంప్యూటర్లు)

English summary
Google launches affordable Chrome devices in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot