భారతీయ భాషాభివృద్థికి ‘ఐఎల్ఐఏ’ : గూగుల్

Posted By:

ఇంటర్నెట్ ద్వారా భారతీయ భాషలను మరింత ప్రోత్సహించేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పలువురు ఆన్‌లైన్ ప్రచురణకర్తల బృందంతో కూడిన ప్రతిష్టాత్మక ‘భారతీయ భాషా ఇంటర్నెట్ అలయన్స్' (ఐఎల్ఐఏ)ను సోమవారం ఆవిష్కరించింది. భారతీయ భాషల కంటెంట్‌ను ఆన్‌లైన్ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లటమే ఈ అలయన్స్ ముఖ్య ఉద్దేశ్యం.

భారతీయ భాషాభివృద్థికి ‘ఐఎల్ఐఏ’ : గూగుల్

గూగుల్ ఇండియా ప్రతిష్టాత్మక భారతీయ భాషా ఇంటర్నెట్ అలయెన్స్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వన్ ఇండియా న్యూస్ పోర్టల్  వ్యవస్థాపకులు బీజీ మహేష్

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా 2017 నాటికి, భారతీయ భాషలను మాట్లాడే 30 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరువకావాలన్నది గూగుల్ సంకల్పం. ఇదే కార్యక్రమంలో గూగుల్.. హిందీ భాషా వాయిస్ సెర్చ్‌‍తో పాటు www.hindiweb.com పేరుతో ప్రత్యేక హిందీ పోర్టల్‌ను విడుదల చేసింది. ఈ పోర్టల్ ద్వారా హిందీ భాషకు సంబంధించిన వెబ్‌సైట్‌లు, బ్లాగ్‌లు, యాప్స్, వీడియోలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

భారత్‌లో ప్రస్తుతం దాదాపు 20 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని, దేశ జనాభాలో ఇది కేవలం 16 శాతం మాత్రమేనని గూగుల్ ఈ సందర్భంగా వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Launches Alliance to Promote Indian languages on Web: Opens Hindi Website As Well. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot