గూగుల్ Auto-Delete Tool, వాటంతట అవే డిలీట్ అవుతాయి

By Gizbot Bureau
|

టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యూజర్ల కోసం గూగుల్ కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట అవుతుంది.

గూగుల్ Auto-Delete Tool, వాటంతట అవే డిలీట్ అవుతాయి

గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్ ఫాంపై సెర్చ్ చేసే యూజర్ లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది.

 యాక్టివీటి డేటా, లొకేషన్ హిస్టరీ

యాక్టివీటి డేటా, లొకేషన్ హిస్టరీ

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ రెండెంటీలో యూజర్లు వాడిన యాక్టివీటి డేటా, లొకేషన్ హిస్టరీ ఈ టూల్ ద్వారా ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ ల్లోని సెర్చ్ లొకేషన్ హిస్టరీ క్లియర్ చేసేందుకు Auto-Delete' కంట్రోల్స్ ప్రవేశపెట్టాం. మీ హిస్టరీ డేటాను గూగుల్ నుంచి సులభంగా డిలీట్ చేసుకోవచ్చని ఇంటర్నెట్ దిగ్గజం ట్విట్టర్ పోస్టులో తెలిపింది.

గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు

గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు

యూజర్ ప్రైవసీ ఇష్యూపై ఇటీవల జరిగిన డెవలపర్ కాన్ఫిరెన్స్ లో గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఈ సమావేశంలో యూజర్ల ప్రైవసీ కోసం కొత్త టూల్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. థర్డ్ పార్టీ యాప్స్ ల్లో యూజర్లు షేర్ చేసిన డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆటో డిలీట్ టూల్ వంటి ఫీచర్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఆటో డిలీట్ టూల్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది.

ట్రాకింగ్ ఫ్రిపెరెన్సెస్ ద్వారా

ట్రాకింగ్ ఫ్రిపెరెన్సెస్ ద్వారా

ఈ ఫీచర్ ని యూజర్లు తమ బ్రౌజర్ లో ట్రాకింగ్ ఫ్రిపెరెన్సెస్ ద్వారా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 3 నెలలు లేదా 18 నెలలు వరకు సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకుంటే అలా మీ డేటా ఆటోమేటిక్ గా ఆ సమయానికి డిలీట్ అయిపోతుంది.

రైళ్ల రాక గురించిన వివరాలు

రైళ్ల రాక గురించిన వివరాలు

ఇదిలా ఉంటే గూగుల్‌ మ్యాప్స్‌ యూజర్లు ఇకపై బస్సు ప్రయాణాలకు పట్టే సమయం, ప్లాట్‌ఫాంపై రైళ్ల రాక గురించిన వివరాలను లైవ్‌లో తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌ సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. అలాగే, ఆటో, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చే ఫీచర్‌ను మ్యాప్స్‌లో పొందుపర్చినట్లు వివరించింది.

గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా

గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా

లైవ్‌ ట్రాఫిక్‌ వివరాలు అందించడం ద్వారా తమ యూజర్లకు ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నట్లు గూగుల్‌ పేర్కొంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ట్రెయిన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ను గురించి తెలుసుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్ల లిస్టు వివరాలు పొందవచ్చు. గతేడాది కొనుగోలు చేసిన వేర్‌ ఈజ్‌ మై ట్రెయిన్‌ యాప్‌ సంస్థతో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు గూగుల్‌ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Erase it, Google: Tech giant rolls out auto-delete tool for clearing location history

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X