గూగుల్ క్రోమ్ 18 బ్రౌజర్‌ని డౌన్ లోడ్ చేసుకున్నారా..!

Posted By: Super

 గూగుల్ క్రోమ్ 18 బ్రౌజర్‌ని డౌన్ లోడ్ చేసుకున్నారా..!

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎప్పుడూ తమయొక్క వినియోగదారులకు కొత్త తనాన్ని చూపడంలో ముందు ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో  గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ 17ని విడుదల చేసి కనీసం రెండు నెలలు కూడా గడవక ముందే గూగుల్ క్రోమ్ 18ని విడుదల చేసింది. క్రోమ్ 18కి సంబంధించిన డౌన్‌లోడ్‌ని గూగుల్ వెబ్‌సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

గూగుల్ క్రోమ్ 18ని ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

మీరు గనుక ప్రస్తుతం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులైతే ఆటోమ్యాటిక్‌గా అప్‌డేట్ అవ్వని పక్షంలో కుడి వైపున పైభాగాన  ఉన్న టూల్స్ ఐకాన్‌పై క్లిక్ చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల లేటెస్ట్ క్రోమ్‌కు సంబంధించిన బిల్డ్ ఆటోమ్యాటిక్‌గా డౌన్‌లోడ్  అవుతుంది.  విండోస్, లైనక్స్, మ్యాక్ లాంటి అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేసే క్రోమ్ బ్రౌజర్ యూజర్స్‌కు అందుబాటులో ఉంది.

గతంలో ఉన్న క్రోమ్ బ్రౌజర్‌తో పోలిస్తే క్రోమ్ 18లో కొత్త కొత్త ఫీచర్స్ ని నిక్షిప్తం చేశారు. Canvas3D and WebGL కొసం గూగుల్ ఫెర్పామెన్స్‌ని అభివృద్ధి చేసింది. ఈ బ్రౌజర్‌కి గ్రాఫిక్స్ హార్డ్‌వేర్ త్వరణం జోడించడం జరిగింది. బీటా విడుదలలో ఈ ఫీచర్ ఉన్నప్పటికీ, ఫైనల్ రిలీజ్ లో దీనిని బ్రౌజర్‌లో నిక్షప్తం చేశారు. దీని సహాయంతో యూజర్స్ 3డి గ్రాఫిక్స్‌ని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ 18 బ్రౌజర్ లో WebGL డెమోల కోసం ప్రత్యేకించి ఓ పేజిని గూగుల్ అంకితం చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot