ఐప్యాడ్ కొసం ప్రత్యేకంగా సెర్చ్ అప్లికేషన్: గూగుల్

Posted By: Super

ఐప్యాడ్ కొసం ప్రత్యేకంగా సెర్చ్ అప్లికేషన్: గూగుల్

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఐప్యాడ్ కొసం కొత్త గూగుల్ సెర్చ్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. గూగుల్ విడుదల చేసిన ఈ కొత్త అప్లికేషన్ ఎక్కువ విజువల్ ఇంటర్ పేస్‌తో కస్టమర్స్‌కి సులభంగా అర్తమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. కొత్తగా రూపొందించిన 'సెర్చ్ ఇంటర్ ఫేస్'ని గూగుల్ ఇన్‌స్టాంట్‌కి అనుసంధానం చేయడం జరిగింది. యూజర్స్ ఎప్పుడైతే సెర్చ్ ట్యాబ్‌లో సెర్చ్ క్వరీని టైపు చేసిన వెంటనే సమాధానాలను చూసే వెసులు బాటు కల్పించడం జరిగింది.

వచ్చిన సమాధానాలలో ఏదైనా సమాధానాన్ని కస్టమర్ సెలక్ట్ చేసుకుంటే, ఐప్యాడ్‌కి ట్విట్టర్ అప్లికేషన్ ఏవిధంగానైతే వర్క్ అవుతుందో అదే విధంగా, కుడి చేతి వైపున సమాధానాలను చూడొచ్చు. దీని వల్ల యూజర్స్ ఈజీగా వారికి కావాల్సిన సమాచారాన్ని కనుగొనవచ్చు. అంతేకాకుండా ఇమేజి లే అవుట్ కూడా చాలా చక్కగా రూపొందించడం జరిగింది.

ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త అప్లికేషన్ వల్ల మరిన్ని గూగుల్ సర్వీస్‌లు, జీ మెయిల్, గూగుల్ ప్లస్, ఫోటోలు, మ్యాప్స్, క్యాలెండర్, గూగల్ డాక్స్ మొదలగున వాటిని యాక్సెస్ చేసుకొవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కొత్త గూగుల్ సెర్చ్ అప్లికేషన్ కంట్రోల్ ప్యానల్ మాదిరి పని చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot