Home
News

గూగుల్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న ఫ్రాన్స్

By Gizbot Bureau

అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా టెక్‌ దిగ్గజం గూగుల్‌ కు యూరోపియన్‌ యూనియన్‌ కు చెందిన ఓ సంస్థ షాక్‌ ఇచ్చింది. డేటా భద్రతా చట్టాలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ యుఎఫ్‌సిక్యు అనే సంస్థ గూగుల్‌ పై క్లాస్‌ యాక్షన్‌ దావా దాఖలు చేసింది.

గూగుల్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న ఫ్రాన్స్

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఫోన్ల నుండి యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్‌ దొంగిలిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. ఇప్పటి వరకు 200 మందికి పైగా యూజర్లు ఈ దావాలో చేరారు. కఠినతరమైన యూరోపియన్‌ యూనియన్‌ డేటా భద్రత చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపై వినియోగదారుల హక్కుల సంస్థ యూఎఫ్‌సీ–క్యూ కొయిసర్‌ గ్రూప్‌ ఈ దావా వేసింది.

 అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో..

అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో..

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఫోన్లు, ట్యాబ్‌లు మొదలైన డివైజ్‌లను ఉపయోగించే యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్‌ మోసపూరితంగా దొంగిలిస్తోందని, దీన్ని అరికట్టే లక్ష్యంతోనే క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ వేశామని యూఎఫ్‌సీ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ అలెయిన్‌ బెజోట్‌ తెలిపారు. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఫ్రాన్స్‌లో 2.8 కోట్ల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లు ఒక్కొక్కరికీ 1,000 యూరోల దాకా పరిహారం లభించే అవకాశాలున్నట్లు వివరించారు.
ఇప్పటిదాకా 200 మంది పైగా ఈ దావాలో చేరినట్లు బెజోట్‌ చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే ఫ్రాన్స్‌కి చెందిన డేటా నియంత్రణ సంస్థ సీఎన్‌ఐఎల్‌ గూగుల్‌పై 50 మిలియన్‌ యూరోల జరిమానా విధించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వినియోగదారులకు విధించే అభ్యంతరకరమైన నిబంధనలు తొలగించాలంటూ ప్యారిస్‌ జిల్లా స్థాయి కోర్టు కూడా గూగుల్‌ను ఆదేశించింది. ఇప్పుడు యుఎఫ్‌సిక్యు సంస్థ వేసిన క్లాస్‌ యాక్షన్‌ దావా గూగుల్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

గతేడాది దావా

గతేడాది దావా

కాగా గతేడాది గూగుల్ తమ ప్రైవసీకి భంగం కలిగిస్తోందంటూ ఓ వ్యక్తి దావా వేశాడు. అనుమతి లేకుండానే తమ కదలికలను నిక్షిప్తం చేస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని సదరు వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు మెట్లు ఎక్కాడు. లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసినప్పటికీ గూగుల్ సర్వీసెస్ మన కదలికలను ట్రాక్ చేస్తోందని అతను దావా వేశాడు. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ కలిగిన అమెరికన్లు తమ కదలికలను రికార్డ్ చేయవద్దని గూగుల్ సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసినప్పటికి సమాచారాన్ని రికార్డ్ చేస్తున్నాయని ఆరోపించారు.

ట్రాక్ చేస్తున్న లొకేషన్ హిస్టరీ

ట్రాక్ చేస్తున్న లొకేషన్ హిస్టరీ

తాము ఎక్కడెక్కడకు, ఎలా వెళ్తున్నామనే విషయాన్ని రికార్డ్ చేస్తోందని, కానీ సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్టరీని ఆప్ చేసుకోవచ్చునని గూగుల్ తన సపోర్ట్ పేజీలో చెప్పిందని, ఆఫ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా ఉందని, వివరాలన్నింటిని ట్రాకింగ్ చేస్తోందన్నారు. గూగుల్ చెప్పింది అంతా అబద్దమని ఆరోపించాడు. ప్రైవసీ చట్టాన్ని గూగుల్ ఉల్లంఘించిందని గత వారం యూనివర్సిటీ పరిశోధకులు కూడా నిరూపించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దావాపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. ఏడేళ్ల కిందటి ఉత్తర్వులు గూగుల్ ఉల్లంఘించిందా పరిశీలించాలని ది ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ సంస్థ కూడా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు లేఖ రాసింది.

గూగుల్‌ మ్యాప్స్‌లో భద్రతా ఫీచర్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో భద్రతా ఫీచర్‌

ఈ వార్తలు నేపథ్యంలో గూగుల్‌ మ్యాప్స్‌ తాజాగా భారత్‌లో ‘స్టే సేఫర్‌' అనే కొత్త ఫీచర్‌ ను ప్రవేశపెట్టింది. ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వాహనం దారి తప్పితే వెంటనే యూజర్లను హెచ్చరించడం ఇందులో ప్రత్యేకత. ఈ ఫీచర్‌ ద్వారా.. ప్రయాణికులు తమ ట్రిప్‌ గురించిన వివరాలు ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులు, మిత్రులకు లైవ్‌లో అందజేయొచ్చని గూగుల్‌ పేర్కొంది. గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో వెళ్లాల్సిన గమ్యస్థానం, మార్గం గురించి సెర్చి చేసిన తర్వాత 'గెట్‌ ఆఫ్‌-రూట్‌ అలర్ట్స్‌' ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని వివరించింది. ఒకవేళ డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ సూచించిన రూటుకు భిన్నంగా దాదాపు అర కిలోమీటరు మేర వాహనాన్ని దారి మళ్లించిన పక్షంలో వెంటనే ప్రయాణికుల ఫోన్‌కు నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది.

Best Mobiles in India

English summary
French Group Launches Class Action Against Google Over Data Privacy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X