ఢిల్లీ ఘటనకు గూగుల్ నివాళి!

By Prashanth
|
Google lights a candle in memory of Delhi braveheart


సభ్యసమాజం తలదించుకునేలా ఆరుగురు మానవ మృగాల చేతిలో అత్యంత కీరాతకంగా అత్యాచారానికి గురై అసువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డ ధామినికి సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ నివాళులర్పించింది. ‘ఇన్ ద మెమరీ ఆఫ్ ఢిల్లీ బ్రేవ్ హార్ట్’అనే ట్యాగ్‌లైన్‌తో ఓ క్యాండిల్‌ను తన హోమ్ పేజీలో ఉంచింది. ఈ ఉదంతానికి సబంధించి వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల వైద్య విద్యార్థిని ధామిని డిసెంబర్ 16 (ఆదివారం రాత్రి) ఆరుగురు కీచక కామాంధుల చేతిలో హత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమోను మెరుగైన వైద్యసేవల నిమిత్తం సింగపూర్ తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. 13 రోజుల చావుబతుకుల పోరటంలో అంతిమంగా ఆమె ఓడిపోయింది. శనివారం తెల్లవారుజామున 2.15 నిమిషాలకు ధామిని తుదిశ్వాస విడిచారు.

టాప్-10 ఆన్‌లైన్ డీల్స్..( ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ఫ్రీ)!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X