Home
News

భయపెడుతున్న గూగుల్ లిస్టింగ్ స్కామ్స్.. ఫేక్ హోటల్ బుకింగ్‌లో రూ.93,600 పోగొట్టుకున్న యువతి!

Google listing scams: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే కంటెంట్ క్రియేటర్ శ్రేయా మిత్రాకు జరిగింది. ఆమె ఏకంగా రూ.93,600 మోసపోయింది. ఆన్‌లైన్‌లో హోటల్స్ బుక్ చేసేవాళ్లందరికీ ఇది కనువిప్పు కలిగించే సంఘటన. శ్రేయ పూరీ సిటీకి ట్రిప్ ప్లాన్ చేస్తూ గూగుల్‌లో హోటల్స్ కోసం వెతికింది. మాయ్‌ఫెయిర్ హెరిటేజ్ పూరీ కోసం గూగుల్‌లో వెతుకుతుండగా, మొదటి ఫలితం నిజమైనదిగా అనిపించడంతో దానిపై క్లిక్ చేసింది.

ఆ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ నంబర్ ఉంది. రూమ్ బుకింగ్ కోసం ఆ నంబర్‌కు ఫోన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు అది మోసగాళ్ల నంబర్ అని ఆమెకు తెలీదు. పైగా మోసగాళ్లు చాలా ప్రొఫెషనల్‌గా మాట్లాడారు. హోటల్ ఫొటోలు, రూమ్ వివరాలు, ధరలు అన్నీ వాట్సాప్‌లో పంపించారు.

Google Listing Scam Exposed  Woman Loses Rs 93 600 on Fake Hotel Booking  Watch Her Shocking Story

రిజర్వేషన్ కన్ఫర్మ్ చేయడానికి ఫోన్‌లోనే డబ్బులు కట్టమని నమ్మించారు. ఫేక్ ఇన్వాయిస్ కూడా పంపించారు. శ్రేయ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడిగితే, వాళ్ల "సిస్టమ్ డౌన్"లో ఉందని, అందుకే ఈమెయిల్ పంపలేకపోతున్నామని చెప్పారు. అప్పటికి కూడా శ్రేయకి అనుమానం రాలేదు. వాళ్లు ఆమెను అలాగే నమ్మిస్తూ వెళ్లారు.

* నెక్స్ట్ డే..

మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి, గూగుల్‌పే ఓపెన్ చేయమని, ఒక బుకింగ్ ఐడీ ఎంటర్ చేసి, బుకింగ్ ఫైనల్ చేయడానికి "పే" బటన్ క్లిక్ చేయమని చెప్పారు. ఇక్కడే శ్రేయకు అనుమానం వచ్చింది. వాళ్ల మాటలు వినడానికి ఆమె ఒప్పుకోలేదు. ఈమెయిల్ కన్ఫర్మేషన్ కావాలని పట్టుబట్టింది. అంతే, వాళ్లు వెంటనే ఫోన్ కట్ చేసేశారు.

అప్పుడు శ్రేయకు ఏదో తేడా కొడుతోందని అర్థమైంది. వెంటనే మాయ్‌ఫెయిర్ హెరిటేజ్ పూరీ అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ వెతికి, వాళ్లకు ఫోన్ చేసింది. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఆమె చూసింది ఫేక్ లిస్టింగ్ అని తేలింది. తాను మోసపోయానని గ్రహించింది.

* అందరికీ హెచ్చరిక

శ్రేయ ఇన్‌స్టాగ్రామ్‌లో "మొదటి గూగుల్ సెర్చ్ రిజల్ట్ ఫేక్ వెబ్‌పేజ్‌కి తీసుకెళ్తే అది ఫేక్ మాయ్‌ఫెయిర్ అని గుర్తించడం కష్టం. మోసగాళ్లు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారు. వేర్వేరు ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారు. దయచేసి దీన్ని షేర్ చేయండి. ముఖ్యంగా హాలిడే సీజన్‌లో ట్రిప్స్ ప్లాన్ చేసేవాళ్లకు ఇది చాలా ముఖ్యం." అని అందరినీ హెచ్చరించింది.

డబ్బులు తిరిగి వచ్చే అవకాశం తక్కువని బాధపడుతూ "మోసగాళ్లు డబ్బులు విత్‌డ్రా చేసుకున్న తర్వాత, అవి తిరిగి రావడం చాలా కష్టం. పోలీసులు ప్రయత్నిస్తారు. కానీ ఈ ముఠా మొత్తం పట్టుబడితే అదే గొప్ప విషయం. నేను సర్దుకుపోయాను. కానీ ఇది చాలా పెద్ద గుణపాఠం" అని చెప్పింది.

ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత సైబర్‌క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఆ ఫేక్ గూగుల్ లిస్టింగ్‌ను తొలగించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త సంస్థ రిపోర్ట్ చేసింది. ఇంకా గూగుల్లో ఇలాంటి ఎన్ని ఫేక్ వెబ్‌సైట్స్‌ చెప్పలేని పరిస్థితి అందుకే అందరూ అలర్ట్ గా, సురక్షితంగా ఉండాలి.

* సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?

హోటల్ వివరాలు అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. హోటల్ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా నమ్మకమైన ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌లోనే బుక్ చేసుకోవాలి. ఫోన్ చేసే ముందు కాంటాక్ట్ నంబర్లను వేర్వేరు సోర్స్‌ల నుంచి ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. తెలియని నంబర్లకు డైరెక్ట్‌గా యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు పంపకూడదు.

ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడగాలి. నిజమైన హోటల్ ఎప్పుడూ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఇస్తుంది. సరైన డాక్యుమెంట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే లేదా తొందరగా డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే ఆగిపోండి. ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వార్తను షేర్ చేయండి.

Best Mobiles in India

English summary
Woman lost Rs 93,600 in a Google listing hotel booking scam. Scammers used a fake website and UPI. Verify hotel details on official sites and be cautious with online payments to avoid fraud.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X