‘స్మార్ట్ చిప్’ జత చేస్తే చాలు మీ జీమెయిల్ ఓపెన్ అవుతుంది!

Posted By: Super

‘స్మార్ట్ చిప్’ జత చేస్తే చాలు మీ జీమెయిల్ ఓపెన్ అవుతుంది!

 

లండన్:  గూగుల్ ఖాతాదారులకు మరింత సౌకర్యవంతమైన రోజులు మున్ముందు రాబోతున్నాయ్. సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తమ ఖాతాలకు సంబంధంచి పాస్‌వర్డ్‌ల స్థానంలో ఫిజికల్ కీ సాంకేతిక పరిజ్ఞానాన్నిసాకారం చేసేందుకు కసరత్తులు చేస్తోంది.  ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే పాస్‌వర్డ్‌లతో పనిలేకుండా  ఓ ప్రత్యేక యూఎస్బీ స్మార్ట్ చిప్‌ను మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు జతచేస్తే చాలు మీ జీమెయిల్ టక్కున ఓపెన్ అవుతుంది. కేవలం యూఎస్బీ స్మార్ట్ చిప్‌లే కాకుండా మొబైల్ పోన్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా భవిష్యత్‌లో గూగుల్ ఖాతాకు పాస్‌వర్డ్‌‍లుగా మార్చనున్నారు. ఈ సరికొత్త సాంకేతికతకు సంబంధించిన  వివరాలను గూగుల్ భద్రతా నిపుణులు వచ్చే నెలలో వెల్లడించనున్నట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది.

గూగుల్ కార్యాలయాలు (వరల్డ్ వైడ్)!

ఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)

2013…గూగుల్ ఐ/వో  డెవలపర్ సదస్సు వివరాలు!

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  ‘గూగుల్  ఐ/వో’(Google I/O) డెవలపర్ సదస్సుకు సంబంధించి తాజా షెడ్యూల్ విడుదలైంది. 2013కుగాను  మే15 నుంచి 17 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు గూగుల్ వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో గూగుల్ తన కొత్త వర్షన్ వోఎస్ ఆండ్రాయిడ్ 5.0 (కీ లైమ్ పీ)తో పాటు భవిష్యత్ ఉత్పత్తులను ప్రదర్శించనుంది.  ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొత్త ఏడాది ఆరంభంలోనే ప్రారంభించ నున్నట్లు గూగుల్ పేర్కొంది. 2012ఎడిషన్ గూగుల్ ఐ/వో సదస్సులో భాగంగా  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్, నెక్సస్ 7 టాబ్లెట్, కూల్ ప్రాజెక్ట్ గ్లాస్ ప్రోటోటైప్ వంటి కొత్త ఆవిష్కరణలను గూగుల్ చేపట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot