ఈజీ షాపింగ్ కోసం గూగుల్ క్రోమ్‌లో సరికొత్త బ్రౌజర్

By Gizbot Bureau
|

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్తను చెప్పింది. ఇందులో భాగంగా క్రోమ్ బ్రౌజర్ యూజర్లు ఈజీగా షాపింగ్ చేసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇకపై ఈజీగా షాపింగ్ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీకు తప్పనిసరిగా Google Pay అకౌంట్ ఉండాలి.గూగుల్ పే ఉన్నట్లయితే మీరు క్రోమ్ నుంచి పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ పై షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయంలో డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు థర్డ్ పార్టీ సైట్ కు రీడైరెక్ట్ అవసరం లేకుండా నేరుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.అది ఎలా చేయాలో చూద్దాం.

Google makes shopping easy via Chrome browser

డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు

ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లోని పేమెంట్స్ మెథడ్స్ ఆప్షన్ దగ్గర మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు షాపింగ్ జోన్ లో కెళ్లి అక్కడ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే Google Pay అకౌంట్ వాడే జీమెయిల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.

Google makes shopping easy via Chrome browser

స్టెప్ 1
ముందుగా మీ ల్యాప్ టాప్ లేదా PC లేదా మొబైల్ డివైజ్ ల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. Google Pay అకౌంట్ వాడే యూజర్లు వారి (జీమెయిల్) ద్వారా లాగిన్ అవ్వండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తరువాత అక్కడ టాప్ రైట్ కార్నర్ దగ్గర కనిపించే డ్రాప్ మెనూలో సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ కనిపించే పేమెంట్ మెథడ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.

స్టెప్ 2
క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపించే చెక అవుట్ ఫారమ్స్ ఓపెన్ చేయండి. అందులో మీ అడ్రస్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులను Add Card ద్వారా యాడ్ చేసుకోండి. Chrome sync ఆప్షన్ టర్న్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు ఈ ఫీచర్ వాడొచ్చు. నేరుగా షాపింగ్ పేమెంట్ చేయవచ్చు.

స్టెప్ 3
గూగుల్ క్రోమ్ లో లాగిన్ కాగానే కార్డు ద్వారా పేమెంట్స్ చేసేందుకు ఆప్షన్ కనిపిస్తుంది. మీ కార్డు CVC ఎంటర్ చేసి Confirm చేస్తే చాలు.. పేమెంట్ పూర్తి అవుతుంది. ఒకవేళ.. మీ అకౌంట్ లో కొత్త కార్డు యాడ్ చేసుకోవాలంటే.. గూగుల్ పే నుంచి ఈమెయిల్ కు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. గూగుల్ అకౌంట్ లో సేవ్ చేసిన కార్డులను ఎప్పుడంటే అప్పుడు డిలీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఆప్సన్ కూడా గూగుల్ లో ఉంది. ఒకవేళ యూజర్..పేమెంట్ మెథడ్ ను స్థానిక డివైజ్ లో మాత్రమే సేవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.

Google makes shopping easy via Chrome browser

Add Your Card

Chrome సెట్టింగ్స్ లోని Payments methodsలో Add అనే బటన్ దగ్గర Add Your Card ఉంటుంది. అక్కడ మీరు కొత్త కార్డు యాడ్ చేయాలనుకుంటే దానికి అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా గూగుల్ వెబ్ సైట్లో మీరు లాగిన్ అయిన అకౌంట్ అలాగే క్రోమ్ బ్రౌజర్ లో లాగిన అయిన జీమెయిల్ అకౌంట్ ఒకటే అయితే మాత్రం మీరు క్రోమ్ సెట్టింగ్స్ లో Allow Chrome Sign-in టర్న్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Google makes shopping easy via Chrome browser

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X