Google మ్యాప్స్ అల్గోరిథంలో సరికొత్త మార్పులు!! వేగవంతమైన మార్గం చూపనట్లే...

|

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన యొక్క నావిగేషన్ యాప్- గూగుల్ మ్యాప్స్ యొక్క అల్గోరిథంలో మార్పులను తీసుకువస్తుంది. ఇది మీరు డ్రైవ్ చేసే విధానంలో పూర్తిగా మార్పులను తీసుకువస్తున్నది. ఆటోఎవల్యూషన్ నివేదిక ప్రకారం గూగుల్ తన అల్గోరిథంలో మార్పులను చేస్తోంది. ఇది డ్రైవర్లు పాయింట్ A నుండి B వరకు వేగంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

Google Maps Algorithm Latest Changes!! As if There is no Faster Route

కొన్ని నివేదికల ప్రకారం ఈ సంవత్సరం తరువాత కంపెనీ గూగుల్ మ్యాప్స్ కోసం ఒక అప్ డేట్ ను తీసుకువస్తుంది.ఇందులో భాగంగా వినియోగదారులు వారి గమ్యాన్ని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ త్వరిత లేదా శీఘ్ర మార్గాన్ని చూపించదు. దీనికి బదులుగా నావిగేషన్ యాప్ అత్యంత సమర్థవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని చూపుతుంది. ఈ కొత్త అల్గోరిథం ఇంధన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది మరియు సమయానికి బదులుగా ఎంత గ్యాస్ లేదా పెట్రోల్/డిజిల్ ఉపయోగించబడుతుందో దానిపై దృష్టి పెడుతుంది.

Google Maps Algorithm Latest Changes!! As if There is no Faster Route

ఈ కొత్త ఫీచర్ గాలిలో కార్బన్ డయాక్సిడ్ శాతాన్ని తగ్గించడంలో సహాయపడడానికి అందించిన మార్గాలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఒకవేళ మీరు మీ గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనుకుంటే కనుక మీరు పాత అల్గోరిథంకు తిరిగి రాగలుగుతారు. తరువాత మ్యాప్స్ మీకు వేగవంతమైన మార్గాన్ని చూపుతుంది. అయితే అప్ డేట్ తరువాత గూగుల్ మ్యాప్స్ మొదట ఇంధన-సమర్థవంతమైన మార్గాన్ని చూపుతుంది.

Google Maps Algorithm Latest Changes!! As if There is no Faster Route

ఇది కాకుండా ఈ గూగుల్ మ్యాప్స్ ప్రజా రవాణాను నిర్వహించే విధానాన్ని మెరుగుపరచడానికి గూగుల్ కూడా కృషి చేస్తోంది. త్వరలో గూగుల్ మ్యాప్స్ యూజర్లు టైమ్ ట్రావెల్ మరియు ఖచ్చితమైన రాక సమయంతో పాటు ప్రజా రవాణా గురించి దశల వారీ సమాచారాన్ని చూడగలరు. ఇటీవల గూగుల్ ఆండ్రాయిడ్‌లోని మ్యాప్స్‌కు దిక్సూచి విడ్జెట్‌లను తిరిగి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ యాప్ నుండి ముందే తొలగించబడింది. నావిగేషన్ స్క్రీన్‌లో ఎక్కువ స్థలాన్ని కల్పించడానికి గూగుల్ 2019 లో మ్యాప్స్ నుండి దిక్సూచి విడ్జెట్లను తగ్గించింది. ఈ ఫీచర్ మ్యాప్స్ హోమ్ స్క్రీన్‌లో చిన్న ఎరుపు పాయింటర్‌తో వినియోగదారులకు ఉత్తరం వైపు చూపుతుంది. దిక్సూచి విడ్జెట్ స్క్రీన్ కుడి వైపున చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Google Maps Algorithm Latest Changes!! As if There is no Faster Route

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X