Home
News

గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్‌ ట్రిప్‌ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!

గూగుల్‌ మ్యాప్స్ (Google Maps) ఇటీవల అనేక అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనదారులకు ఉపయోగపడేలా కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫలితంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఇబ్బందులు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఏంటీ ఫీచర్, ఎలా పనిచేస్తుంది..

ఈ సమస్యకు గూగుల్‌ మ్యాప్స్‌లో పరిష్కారం :
భారత్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే అవసరానికి తగిన ఛార్జింగ్ స్టేషన్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఈ సమస్యకు గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌ పరిష్కారం చూపనుంది.

Google maps will help to find EV charging stations

ఆటోమేటిక్‌గా సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు :
ఈ గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది. ఏదైనా ప్రాంతంలో EV ల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఛార్జింగ్‌ సమస్యలను ఎదుర్కొంటాం. అన్నిసార్లు, అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. ముఖ్యంగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా :
గూగుల్‌ మ్యాప్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ ద్వారా సమీపంలోని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలను అందిస్తుంది. రియల్‌టైం డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గానే ఈ వివరాలను మ్యాప్స్‌లో కనిపించనున్నాయి. ఛార్జింగ్‌ స్పీడ్‌ సహా ఛార్జింగ్‌ పోర్టు లభ్యత వివరాలను అందించనుంది.

Google maps will help to find EV charging stations

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ మ్యాప్స్‌ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే తొలుత గూగుల్‌ బిల్ట్‌ -ఇన్ ఉన్న వాహనాలకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. రోడ్‌ ట్రిప్‌లు సహా ఇతర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్‌ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వాహనం ఛార్జింగ్ ఆధారంగా దగ్గరలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది.

భారత్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే భవిష్యత్‌ ఈవీలదే అన్ని బలంగా నమ్ముతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు.. ఈ రంగంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతోపాటు ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీలను అందిస్తోంది.

అయితే ముఖ్యంగా ఛార్జింగ్‌ స్టేషన్ల కొరతతోపాటు వాటికి సంబంధించిన సమాచారం కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ఈ సమస్యకు గూగుల్‌ మ్యాప్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ చెక్‌ పెట్టనుంది. ఫలితంగా దూర ప్రాంతాల ప్రయాణాల్లో ఛార్జింగ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Google maps artificial intelligence feature will locate nearest EV charging stations soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X