ఫేస్‌బుక్‌ని బీట్ చేసిన గూగుల్ మ్యాప్స్, లండన్ ఫేవరేట్ టాప్‌ లిస్ట్‌లో

Posted By: Super

ఫేస్‌బుక్‌ని బీట్ చేసిన గూగుల్ మ్యాప్స్, లండన్ ఫేవరేట్ టాప్‌ లిస్ట్‌లో

లండన్: ఇటీవల జరిగినటువంటి కొత్త మార్కెట్ రీసెర్చ్ స్టడీ సర్వే ప్రకారం గూగుల్ మ్యాప్స్, ప్రపంచం మొత్తం ఎంతో ఆదరణను చూరగోన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌‌బుక్‌ని అధిగమించిందని వెల్లడించింది. ఈ సర్వేలో లండన్‌లోని మొబైల్ యూజర్స్ ఎక్కువగా వాడేటటువంటి అప్లికేషన్‌గా గూగుల్ మ్యాప్స్ నెంబర్ వన్ స్దానాన్ని సంపాదించుకుంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే ఈ సర్వేని కామ్ స్కోర్, జిఎస్‌ఎమ్ రెండు సంయుక్తంగా నిర్వహించగా ఏప్రిల్ 2011లో 6.4మిలియన్ యూజర్స్ గూగుల్ మ్యాప్స్‌కి అనుసంధానం అవ్వడం జరిగింది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ఫేస్‌బుక్‌కి అదే పిరియడ్‌లో కేవలం 3.5మిలియన్ యూజర్స్ మాత్రమే అనుసంధానం అవ్వడం జరిగింది. దీంతో ఫేస్‌బుక్‌ వృధ్దిరేటు పతనం కావడం ప్రారంభించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాల్గవ స్దానంలో గూగుల్ మొబైల్, ఐదవస్దానంలో యూట్యూబ్, ఆరవ స్దానంలో ఈబే చోటు దక్కించుకున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot