Just In
- 6 min ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 3 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
- 19 hrs ago
Nokia T21 టాబ్లెట్ ఇండియా లో లాంచ్ అయింది! ధర,స్పెసిఫికేషన్లు
- 21 hrs ago
లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‌టాప్ ఇండియాలో లాంచ్ అయింది! వివరాలు!
Don't Miss
- Sports
IND vs NZ: ఓయ్ రోహిత్.. బుద్దుందా? ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వరా? ఫ్యాన్స్ ఫైర్!
- Movies
Veera Simha Reddy 6 Days Collections: బాలయ్య బాబు అదే దూకుడు.. ఇంకా కొద్దీ దూరంలోనే టార్గెట్!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ Racer అన్ని వివరాలు.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్
- News
శివుడి ఆలయంలో నటి అమలా పాల్‌కు దక్కని ప్రవేశం- బయటి నుంచే మొక్కులు..!!
- Lifestyle
గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనక ఉన్న అర్థమేంటంటే..
- Finance
Layoffs: మీటింగ్ అంటూ పిలిచి.. ఉద్యోగులను పీకేసిన బడా కంపెనీ.. ఏడుస్తున్న 3000 మంది..!!
- Travel
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొని కాశీ అందాలను ఆస్వాదించండి!
Google Maps లో కొత్త ఫీచర్! మీ ప్లేస్ లోని ఎయిర్ క్వాలిటీని కనుగొనవచ్చు...
గూగుల్ మ్యాప్స్ యొక్క ఉపయోగం గురించి ప్రత్యేకంగా తెలుపవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరమైన మరొక కొత్త ఫీచర్‌ని అందుకున్నది. ఇది మీరు సెర్చ్ చేస్తున్న ఏదైనా స్థలంలో గల గాలి నాణ్యతను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫంక్షనాలిటీతో మీరు సందర్శించే ముందే ఆ స్థలం యొక్క గాలి నాణ్యతను కనుగొనడానికి మీకు సహాయం చేస్తుంది. తద్వారా మీరు నిజంగా అక్కడికి వెళ్లాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త లేయర్
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేది గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త మ్యాప్ లేయర్. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఇతర సమాచారం కోసం మీకు తెలియని కొత్త ప్లేస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఆ లేయర్‌ని ఆన్ చేసి ఆ స్థలం యొక్క గాలి నాణ్యతను మరియు సమీపంలోని ముఖ్యమైన స్థలాలను కూడా చూడవచ్చు.

సెర్చ్ పట్టీకి దిగువ భాగంలో కుడి వైపున ఉన్న వృత్తాకార బటన్‌ను నొక్కడంతో ఇది వివిధ మ్యాప్ లేయర్‌లను ఓపెన్ చేస్తుంది. వాటిలో ఒకటి గాలి నాణ్యతను చూపే మ్యాప్ లేయర్ కూడా ఉంటుంది. దీనిని ప్రారంభించిన తర్వాత మీరు వివిధ ప్రదేశాలలో గల వివిధ రకాల కలర్ చుక్కలను చూస్తారు. ఎరుపు కలర్ లో ఉన్నవి చాలా ప్రమాదకరమైనది, యల్లో మరియు ఆరంజ్ కలర్ లో ఉన్నవి కూడా అనారోగ్యకరమైనవి. చివరిగా గ్రీన్ (ఆకుపచ్చ) కలర్ లో ఉన్న ప్రాంతాలు గాలి నాణ్యత సురక్షితంగా ఉండడాన్ని సూచిస్తాయి.

గాలి నాణ్యతను చూడడానికి నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకోవడం వలన దీనిపై మరింత సమాచారాన్ని చూసే ఎంపిక కూడా మీకు అందించబడుతుంది. భారతదేశంలోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరియు పర్పుల్ ఎయిర్ ద్వారా గాలి నాణ్యత డేటా అందించబడుతుంది. ఇది నేషనల్ AQI, CPCB (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నుండి అందించబడింది.

Google Maps అదనంగా వైల్డ్ ఫైర్ అనే లేయర్ ని కూడా పొందింది. ఇది మీ యొక్క సమీప ప్రాంతాలలో మంటలు యాక్టివ్ అయితే కనుక వాటి యొక్క వివరాలను చూపుతుంది. ఈ వివరాలు నేషనల్ ఇంటరాజెన్సీ ఫైర్ సెంటర్ (NIFC) నుండి తీసుకోబడుతుంది. ఇది కూడా ఇప్పుడు లైవ్ లో చూపుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో గాలి నాణ్యతను చూడగల సామర్థ్యం ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. గూగుల్ మ్యాప్స్ యాప్‌కి ఈ కొత్త ఫీచర్ యొక్క యాక్సెస్ ను పొందడానికి దాన్ని అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470