గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా స్పీడ్ కెమెరా ఫీచర్, పూర్తి వివరాలు మీకోసం

|

ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ అడ్రస్ కోసం ముందుగా వెతికేది గూగుల్ మ్యాప్ నే అనే విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అక్కడ అడ్రస్ తెలియక నావిగేసన్ కోసం గూగుల్ మ్యాప్ వాడుతూ అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి మరింత సులువుగా అడ్రస్ తెలుసుకునేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ని అప్ డేట్ చేస్తూనే ఉంది.

గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా స్పీడ్ కెమెరా ఫీచర్, పూర్తి వివరాలు మీకోసం

 

తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను గూగుల్ అందులో జతచేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.

వాహనాలు నడిపే సమయంలో..

వాహనాలు నడిపే సమయంలో..

మీరు వేగంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు స్పీడ్ కెమెరాలు ఎక్కడున్నాయో తెలియకపోవడం వల్ల ఫైన్ చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడొచ్చిన కొత్త ఫీచర్ లో ఎక్కడెక్కడ స్పీడ్ కెమెరాలు ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ ముందే హెచ్చరిస్తోంది.

మ్యాప్‌లోనే స్పీడ్ కెమెరా

మ్యాప్‌లోనే స్పీడ్ కెమెరా

మీరు మ్యాప్‌లోనే స్పీడ్ కెమెరాను గుర్తించి మీ బండి వేగాన్ని తగ్గించొచ్చు. మీకు కొన్ని కిలోమీటర్ల ముందుగానే స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించి గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో బ్లూ కలర్‌లో సీసీ కెమెరా ఐకాన్‌ కనిపిస్తే అక్కడ స్పీడ్ ట్రాప్ కెమెరా ఉన్నట్టుగా మనం గుర్తించాలి.

యాక్సిడెంట్స్ జరిగినట్టైతే
 

యాక్సిడెంట్స్ జరిగినట్టైతే

స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించడం కాకుండా మీరు వెళ్లే రూట్‌లో ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినట్టైతే ఆ విషయం కూడా గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోవచ్చు. ముందుగానే యాక్సిడెంట్ గురించి మీకు సమాచారం లభిస్తుంది. మీకు గూగుల్ మ్యాప్స్‌లో రెడ్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ సరిగ్గా పనిచేయట్లేదని తెలుస్తోంది. రోడ్డు రిపేర్ చేస్తున్నా... ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టు గూగుల్ మ్యాప్స్ చూపిస్తోంది.

యాక్సిడెంట్ రిపోర్ట్

యాక్సిడెంట్ రిపోర్ట్

ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మీరే స్వయంగా రిపోర్ట్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ADD a Report అనే సదుపాయం ద్వారా మీరు యాక్సిడెంట్ సమాచారాన్ని అప్ డేట్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
GOOGLE MAPS CAN NOW DETECT SPEED TRAP CAMERAS, ALERT ABOUT ACCIDENTS IN YOUR ROUTE

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more