గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్

By Gizbot Bureau
|

టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు తన గూగుల్ మ్యాప్స్‌లోకి సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా ఫీచర్ ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. కొత్తగా వస్తున్న ఈ ఫీచర్ డ్రైవింగ్ చేసే వారికి ఉపయోగపడనుంది.

గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్

 

టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే వారిని అలర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ నూతన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. 'ఆఫ్‌ రూట్‌’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్‌ అనే ఆప్షన్‌లో ఆఫ్‌ రూట్‌ అలర్ట్‌ అనే ఈ ఫీచర్‌ ఉంటుందని ఎక్స్‌డీఏ డెవలపర్లు తెలిపారు.

500 మీటర్లు దాటిన ప్రతిసారి అలర్ట్‌

500 మీటర్లు దాటిన ప్రతిసారి అలర్ట్‌

టాక్సీ ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో 500 మీటర్లు దాటిన ప్రతిసారి ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారునికి అలర్ట్‌ వస్తుందని తెలిపారు. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్‌ చూపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్‌ ఇంకా ప్రకటించలేదు. బ్రెయిన్‌ లైవ్‌ స్టేటస్, బస్‌ ప్రయాణ సమయం, మిక్స్‌డ్‌ మోడ్‌లో ఆటోరిక్షా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వంటి నూతన ఫీచర్లను గూగుల్‌ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.

స్పీడో మీటర్‌‌ ఫీచర్

స్పీడో మీటర్‌‌ ఫీచర్

స్పీడో మీటర్‌‌ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వెళ్లే వేగాన్ని సూచిస్తుంది. అడ్రస్ కనుక్కోవాలి.. తొందరగా వెళ్లాలి అని కొందరు వాహనాన్ని వేగంగా తోలుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు వున్నాయని గూగుల్ గ్రహించినట్టుంది. అందుకే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇప్పటి వరకు రూట్‌ తెలుసుకోవడానికి మాత్రమే పరిమితమైన గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై మనం వాహనంపై వెళ్లే వేగాన్ని కూడా చూపించనుంది.

 వాహనం నడిపేటప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో..
 

వాహనం నడిపేటప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో..

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే మీరు వాహనం నడిపేటప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో చూడొచ్చు. అంతేకాదు నిర్దేశించిన వేగం దాటిన తర్వాత మీకు హెచ్చరికలు కూడా గూగుల్‌ మ్యాప్స్‌ జారీ చేస్తుంది.అయితే, ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. అమెరికా, యూకే, యూరప్‌, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందట. భారత్‌లో కూడా పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ కావాలంటే..

ఈ ఫీచర్ కావాలంటే..

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో నేవిగేషన్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే డ్రైవింగ్‌ ఆప్షన్‌ దగ్గర స్పీడో మీటర్‌కు సంబంధించిన సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. దాన్ని ఎనేబుల్‌ చేసుకుంటే డిస్‌ప్లే పై స్పీడో మీటర్‌ను పొందొచ్చు. అయితే, ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన వారికి మాత్రమే తెరపై కనిపిస్తాయి.

రైల్వే లైవ్ స్టేటస్ ఫీచర్

రైల్వే లైవ్ స్టేటస్ ఫీచర్

దీంతో పాటుగా ఈ మధ్య రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైళ్ల రాకపోకలు, ఎంత సమయం ఆలస్యమవుతుంది. ఏ ప్లాట్ ఫామ్ మీదకు రైలు వస్తుంది, తరువాతి స్టేషన్ ఏంటి అనే ఫీచర్లను సైతం ఈ గూగుల్ కొత్త ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పునే, లక్నో, హైదరాబాద్, చెన్నై, మైసూర్, కోయంబత్తూరు, సూరత్ వంటి నగరాల్లో గమ్యస్థానం చేరుకునేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందో ఈ ఫీచర్ల ద్వారా సదుపాయం కలిగింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Maps get test 'off-route' alert feature in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X