Home
News

డెస్క్‌టాప్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కి క్విక్ డయలింగ్ వచ్చేస్తోంది

By Gizbot Bureau

టెక్ గెయింట్ గూగుల్ కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారును అలరిస్తున్న సంగతి విదితమే. ఎప్పటికప్పుడు గూగుల్ ఉత్పత్తులలో సరికొత్త అప్ డేట్లను అందిస్తూ వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. మొబైల్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద అనేక రకాలైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త ఫీచర్ ని వినియోగదారులకు పరిచయం చేయనుంది. ప్రముఖ టెక్ వెబ్ ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం గూగుల్ డెప్క్ టాప్ మీద ఉన్ నంబర్ ను నేరుగా మీ మొబైల్ కి కనెక్ట్ అయ్యేలా ఫీచర్ ను తీసుకురానుంది. అంటే డెస్క్ టాప్ మీద ఉన్న నంబర్ ను క్లిక్ చేస్తే నేరుగా అది మీరు వాడే ఫోన్ కి కనెక్ట్ అయి క్విక్ కాల్ గా వెళుతుంది. అక్కడ మీకు కాంటాక్ట్ నంబర్ మీ మెయిల్ ద్వారా చూడవలిసి ఉంటుంది. మీ మొబైల్ నుండి డయలర్ ఓపెన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి గూగుల్ మరింత ఫీచర్లను జోడించి ఇకపై అలాంటి అవసరం లేకుండా నేరుగా కనెక్ట్ అయ్యేలా పీచర్ ను తీసుకురానుంది.

ఎలా చేయాలి

ఎలా చేయాలి

క్రోమ్ బీటా వర్షన్ 78లో గూగుల్ కొత్త ఫీచర్ ను చూడవచ్చు. గూగుల్ నుంచి మీకు ఏదైనా నంబర్ కనిపిస్తే దానిపై వెంటనే రైట్ క్లిక్ చేస్తే చాలు.మీకు అక్కడ కొన్ని ఆప్సన్లు కనిపిస్తాయి. మీ అడ్రస్ బార్ కింద ఏఫోన్లు అయితే కనెక్ట్ అయి ఉన్నాయో వాటి వివరాలు కనిపిస్తాయి.

సెలక్ట్

సెలక్ట్

ఈ డివైస్ లో మీరు కాల్ చేయాలనుకున్న డివైస్ ను సెలక్ట్ చేసుకున్న తరువాత గూగుల్ క్రోమ్ నుంచి మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ట్యాప్ చేస్తే ఆటోమేటిగ్గా అదే డయలర్ మీద పేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు నేరుగా కాల్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో..

ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో..

కాగా ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది. Chrome beta v78 హైపర్ లింక్ ద్వారా యూజర్లు ప్రయత్నించవచ్చు. మీరు ఆ వర్షన్ వాడుతున్నట్లయితే (chrome://flags/#click-to-call-context-menu-selected-text) ఈ లింక్ ను కాపీ చేసుకోవడం ద్వారా మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మీ గూగుల్ అడ్రస్ బార్ మీద దీన్నిఈ లింక్ పేస్ట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. 

ఆండ్రాయిడ్ 9 లేక 10

ఆండ్రాయిడ్ 9 లేక 10

కాగా ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేక 10 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న వారికి మాత్రమే పనిచేస్తుంది. కాగా గూగుల్ ఈ మధ్య పాస్ వర్డ్ చెకప్ ఫీచర్ ని లాంచ్ చేసిన సంగతి విదితమే. ఈ ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.

Best Mobiles in India

English summary
Google may let you send phone numbers from desktop to smartphone’s dialler for quick calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X