ఇలా ఐతే గూగుల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది: చైనా పీపుల్స్ డైలీ

Posted By: Staff

ఇలా ఐతే గూగుల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది: చైనా పీపుల్స్ డైలీ

బీజింగ్: ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫీసియల్స్, చైనా పోలిటికల్ యాక్టివిస్ట్‌‌లకు సంబంధించినటువంటి జీమెయిల్స్ ఎకౌంట్స్ హ్యాకింగ్ చేయడం జరిగిందని టెక్నాలజీ గెయింట్ గూగుల్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ వార్ ఇప్పుడు మరింత ముదిరింది. జీమెయిల్ హ్యాకింగ్ విషయంపై చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ గూగుల్‌కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ఏమిటంటే జీమెయిల్ హ్యాకింగ్ చైనా ప్రభుత్వమే దగ్గరుండి మరీ హ్యాకింగ్ చేయిందని జీమోయిల్ ఆరోపిస్తుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. గూగుల్ కంపెనీ కావలనే మాపై ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని చైనా గవర్నమెంట్ అఫీసియల్ న్యూస్ పేపర్ పీపుల్స్ డైలీ ప్రచురించింది.

అందులో ఉన్న కధనం ప్రకారం చైనా గవర్నమెంట్‌‌లో పని చేస్తున్నటువంటి కొంత మంది ఆఫీసియల్స్ జీమెయిల్స్ మీద కూడా హ్యాకింగ్ ఎటాక్స్ జరిగాయని అన్నారు. మేమే గనుక చేయింటి ఉంటే అలా ఎందుకు చేస్తామని ప్రస్తావించారు. గూగుల్ మాత్రం ఈ జీమెయిల్స్ హ్యాకింగ్ చైనా ప్రభుత్వమే దగ్గరుండి మరీ చేయిస్తుందని పనిగట్టుకోని మరీ అందరికి చెబుతుంది. ఇదంతా నిరాధారం అని చైనా పీపుల్స్ డైలీ ప్రచురించింది. గతంలో చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్‌‌తో జరిగిన సెన్సార్‌‌‌షిప్ ప్రాబ్లమ్స్ వల్ల సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌ సర్వీస్‌ని అధికారంగా బయటకు పంపివేయడం జరిగింది.

తర్వాత స్పందించినటువంటి చైనా ప్రభుత్వం గూగుల్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలలో నిజం లేదని కొట్టిపారేసింది. అంతేకాకుండా జీమెయిల్ ఎటాక్స్ జరిగిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ దీనిపై విచారణ జరపడానికి యఫ్‌బిఐని కూడా ఆదేశించడం విశేషం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot