Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
khiladi: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను వదిలేసి నన్ను పట్టుకుంటారా ?, అందుకేనా మీకు జీతాలు !
- Finance
Budget 2023: కీలకంగా డిఫెన్స్ బడ్జెట్.. పాక్, చైనాలకు ధీటుగా భారత్ ఉందా..?
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Google Meet మీటింగ్స్ ఇక YouTube లో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు!
ప్రముఖ టెక్ దిగ్గజం Google తమ మీటింగ్ యాప్ Google Meet లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. Google Meet యూజర్లు వారి మీటింగ్‌లను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే విధంగా అవకాశాలు కల్పించబోతోంది. ఇందుకోసం మీటింగ్ అడ్మిన్‌లు.. యాక్టివిటీస్ పానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ ఫీచర్‌కు సంబంధించి Google సంస్థ ఈ విధంగా స్పందించింది. "గూగుల్ మీట్ యూజర్లు తమ సంస్థ వెలుపల ఉన్న తమ ఫాలోవర్స్‌కు కూడా సమాచారాన్ని అందించాలనుకున్నప్పుడు ఈ ప్రత్యక్ష ప్రసారం చేసే ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా మీటింగ్ వీక్షించే వారు పాస్ చేసుకోవచ్చు.. మరియు అవసరమైన సమయంలో రీప్లే కూడా చేయడానికి వీలు కల్పిస్తుంది." అని Google వివరించింది. అయితే, YouTubeలో ప్రత్యక్ష ప్రసారం కోసం ఛానెల్ అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. Google Meet ద్వారా లైవ్‌స్ట్రీమ్ చేయడానికి ముందుగా వారి ఛానెల్ నుంచి తప్పనిసరిగా ఆమోదం కలిగి ఉండాలని Google సూచించింది.
హోస్ట్ మేనేజ్‌మెంట్ ఆన్‌లో ఉన్నప్పుడు, హోస్ట్ మరియు సహ-హోస్ట్‌లు మాత్రమే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించగలరని పేర్కొంది. ఆ ఎంపిక ఆఫ్‌లో ఉంటే, మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా, ఎవరైనా సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే Google ప్రైవసీ ఎంపికను కూడా అందిస్తుంది.

ఇతర మీట్ యాప్‌లకు విభిన్నంగా యూజర్లను కాస్త ప్రత్యేకంగా ఆకట్టుకోవడానికి మార్గంగా Google ఈ లైవ్‌స్ట్రీమింగ్ ఫీచర్ తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. మొదటగా, జూలై 21 నుండి మూడు రోజులలోపు ఎంపిక చేయబడిన డొమైన్‌లలో ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత క్రమంగా షెడ్యూల్డ్ రిలీజ్ కు జులై 25 నుండి 15 రోజుల వరకు పట్టవచ్చు అని నివేదిక పేర్కొంది.
Google Meet లో డిస్టర్బ్ చేస్తున్నారా.. అయితే పూర్తిగా బ్లాక్ చేయండి!
Google Meet లో మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు కొందరు ఎదుటి వారికి అంతరాయం కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు కూడా గూగుల్ ఓ సొల్యూషన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గతంలో ప్రకటన చేసింది.

* ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొనే సమయంలో కొందరు వ్యక్తులు మీటింగ్ కి అంతరాయం కలిగే చేసే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరులను డిస్టర్బ్ చేయడం లేదంటే, ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివారిని మీటింగ్ లో నుండి బయటకి రిమూవ్ చేసేందుకు గూగుల్ మీట్ ఇప్పటికే ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా దానికి కొనసాగింపుగా బ్లాక్ అనే మరో కొత్త ఫీచర్‌ను యాడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త బ్లాక్ (Block) ఆప్షన్ ద్వారా అలా డిస్టర్బ్ చేసే వ్యక్తులను పూర్తిగా మళ్ళీ మీట్ లో కనెక్ట్ అవ్వకుండా చేయవచ్చు.
వాళ్లు మళ్లీ మీటింగ్‌లోకి వచ్చే అవకాశం ఉండదు..
Google Meet మీటింగ్‌లలో ఎలా అనవసరంగా డిస్టర్బ్ చేసి వారిని మీటింగ్ లో నుంచి బయటకి జస్ట్ రిమూవ్ చేయడానికి ఇప్పటికే ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ అటువంటి వాళ్ళని పూర్తిగా మళ్లీ మీటింగ్ లో జాయిన్ కాకుండా చేసేందుకు బ్లాక్ ఆప్షన్ తీసుకురానుంది. ఈ బ్లాక్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా ఆ డిస్టర్బ్ చేసే వ్యక్తి ఇక మళ్లీ మీటింగ్ లో జాయిన్ కావడానికి అవకాశం ఉండదు అని గూగుల్ తెలిపింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470