మెరుగైన సౌండ్ తో గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్... ధర కాస్త ఎక్కువ

|

అమెజాన్ ఎకో డాట్‌కు ఛాలెంజర్ అయిన గూగుల్ నెస్ట్ మినీ ఇప్పుడు ఇండియాలో ప్రారంభించబడింది. సెర్చ్ దిగ్గజం గూగుల్ గత నెలలో న్యూయార్క్‌లో పిక్సెల్ 4 స్మార్ట్ ఫోన్ లైనప్‌తో పాటు నెస్ట్ మినీని కూడా ప్రారంభించింది.

గూగుల్
 

స్మార్ట్ స్పీకర్ 2017కి గూగుల్ హోమ్ మినీ అప్డేట్ వెర్షన్ అలాగే ఇది నెస్ట్ శ్రేణి ఉత్పత్తులలో భాగం అవుతుంది. లుక్స్ మరియు అప్పీరియన్స్ పరంగా నెస్ట్ మినీ గూగుల్ హోమ్ మినీతో సమానంగా ఉంటుంది. వీటి యొక్క డిజైన్ ఒకేలా ఉన్నప్పటికీ గూగుల్ నెస్ట్ మినీ మెరుగైన సౌండ్ ను అందిస్తుంది.

వచ్చే ఏడాది ఐఫోన్‌ను బ్యాన్ చేయవచ్చు.. ఎందుకో తెలుసా?

ధర వివరాలు

ధర వివరాలు

స్మార్ట్ స్పీకర్ల స్వీకరణకు జనాదరణ పెరుగుతున్న సమయంలో భారతదేశంలో నెస్ట్ మినీ ప్రారంభమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ల అమ్మకాలను పెంచింది. ఇండియాలో మూడవ తరం ఎకో డాట్ అందుబాటులో ఉండటంతో నెస్ట్ మినీ ఈ సేల్స్ విభాగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇప్పుడు గూగుల్ నెస్ట్ మినీ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.4,499లకు లభిస్తుంది. ఇది తెలుపు మరియు చార్ కోల్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

గూగుల్ సంస్థ స్మార్ట్ స్పీకర్ యొక్క ఆడియో విభాగంలో నెస్ట్ మినీతో ఎక్కువగా దృష్టిని సారించింది. అసలు గూగుల్ హోమ్ మినీ కంటే పరికరానికి రెండు రెట్లు బలమైన బేస్ ఉందని ఇది పేర్కొంది. దీని యొక్క బేస్ మెరుగుపరచడానికి కస్టమ్ డ్రైవర్‌ను చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో సౌండ్ ని పెంచడానికి యాజమాన్య ట్యూనింగ్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. వినియోగదారులు తమ ఫోన్ లేదా మరొక స్మార్ట్ స్పీకర్ లేదా డిస్ప్లే నుండి కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి అనుమతించే కొత్త ఇంటర్‌కామ్ ఫీచర్ కూడా ఉంది.

సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!

ఆడియో కంటెంట్‌
 

ఆడియో కంటెంట్‌ను ప్లే చేస్తున్నప్పుడు మీరు మీ చేతిని డివైస్ కు దగ్గరగా ఉంచితే ఆ స్పీకర్ లైట్ వెలుగులో వెలిగిపోతుంది. అలాగే మీరు వాల్యూమ్‌ను కూడా సర్దుబాటు చేయవచ్చు. నెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ డివైస్‌లో భాగంగా సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను సృష్టించడానికి ఇతర డివైస్‌లతో జత చేయవచ్చు.

Reliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతి

మైక్రోఫోన్

ఇతర లక్షణాలలో భాగంగా మైక్రోఫోన్ మరియు మిషిన్ లర్నింగ్ కోసం ప్రత్యేకమైన చిప్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెస్ట్ మినీ యొక్క సెంట్రల్ బ్రెయిన్ గూగుల్ అసిస్టెంట్ మరియు సెర్చ్ దిగ్గజంతో గతంలో కంటే వేగంగా ఉందని పేర్కొన్నారు. గూగుల్ అసిస్టెంట్ ఇండియాలో ఆంగ్లంలో రెండు వాయిస్లకు మద్దతు ఇస్తుంది. ఎకో డాట్ మాదిరిగా ఇది హిందీకి కూడా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు ఇంగ్లీష్ మాట్లాడని కస్టమర్ల దృష్టిని తమ పైపుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి.

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

ఫీచర్

నెస్ట్ మినీలో వాల్ మౌంట్ అనే ఒక ఆసక్తికరమైన ఫీచర్ కూడా చేర్చబడింది. మీరు మీ యొక్క డెస్క్‌పై ఉంచి లేదా గోడకు తగిలించి ఈ స్మార్ట్ స్పీకర్‌ను ఉపయోగించాలనుకుంటున్నారా అనేది ఇది సులభం చేస్తుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం ఇది YouTube మ్యూజిక్, స్పాటిఫై, గానా, జియోసావన్ మరియు వింక్ మ్యూజిక్ లకు కూడా మద్దతు ఇస్తుంది.

Amazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

నెస్ట్ మినీ

గూగుల్ నెస్ట్ మినీలో వినియోగదారులు ఎటువంటి ప్రకటనలు లేకుండా గానా యొక్క మొత్తం మ్యూజిక్ కేటలాగ్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇది ఫిలిప్స్ హ్యూ, సిస్కా మరియు ఇతరుల బ్రాండ్ల నుండి స్మార్ట్ హోమ్ పరికరాలతో కూడా పనిచేస్తుంది. రూ.4,499 ధర గల నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్ ఎకో డాట్ కంటే కొంచెం ఖరీదైనదిగా అనిపిస్తుంది. అయితే ఇది రెండింటిలో మంచి సౌండింగ్ స్పీకర్ కావచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Nest Mini Smart Speaker Arrived In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X