Home
News

గూగుల్ కొత్త ఫీచర్‌.. సౌండ్‌ చేస్తూ స్పామ్‌ కాల్స్‌పై రియల్‌ టైంలో అలెర్ట్‌ చేస్తుంది..ఎలా యాక్టివేట్ చేయాలి?

స్పామ్‌ కాల్స్‌, స్పామ్‌ మెసెజ్‌లు ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ తరహా కాల్స్‌, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్రాయ్‌ (టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్‌ ఇండియా) కూడా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌లకు కీలక సూచనలు చేసింది. ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్‌.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థ ద్వారా స్పామ్‌ కాల్స్‌ను నియంత్రిస్తోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కూడా స్పామ్‌ కాల్స్‌ కట్టడికి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ స్పామ్‌ కాల్స్‌ సమస్య అధికమవుతున్న నేపథ్యంలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. గూగుల్ పిక్సల్‌ ఫోన్‌లకు తొలుత ఈ ఫీచర్‌ విడుదల కానుంది. రియల్‌టైంలో స్పామ్‌ కాల్స్‌ ను గుర్తించే విధంగా ఈ ఫీచర్‌ ను (Google Spam Call Detection Feature) రూపొందించారు. తొలిసారిగా ఈ ఫీచర్‌ గురించి గూగుల్ I/O 2024 లో ‌వెల్లడించారు.

Google New spam call detection feature

గూగుల్‌ స్పామ్‌ కాల్స్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ కాల్‌ సంభాషణ వింటుంది. ఒకే తరహా సంభాషణలను ఉంటే వెంటనే గుర్తిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే సౌండ్‌ మరియు వైబ్రేషన్‌ ద్వారా యూజర్లను అలెర్ట్‌ చేస్తుంది. దీంతోపాటు డిస్‌ప్లే పైన Likely Scam అంటూ ఓ వార్నింగ్ మెసెజ్‌ కూడా కనిపిస్తుంది. దీంతోపాటు hang up లేదా రిపోర్టు అనే ఆప్షన్‌ లు కూడా ఉంటాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ లో అందుబాటులో ఉంది. దీంతోపాటు పిక్సల్‌ 6 నుంచి 8a మోడళ్లు వరకు ఈ ఫీచర్‌ ను వినియోగించుకోవచ్చు. ఈ గూగుల్‌ కొత్త ఫీచర్‌ యూజర్ల కాల్స్‌ను వింటున్నా.. భద్రత పరంగా, గోప్యత పరంగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. కాల్స్‌ స్టోర్‌ చేయడం లేదా ఇతరులకు షేర్‌ చేయడం జరగదని గూగుల్‌ హామీ ఇస్తోంది.

గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌ లలో ఈ స్కామ్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఆఫ్‌ లో ఉంటుందని తెలిపింది. స్పామ్ కాల్స్‌ తో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే యూజర్లు ఫోన్‌ యాప్‌ ద్వారా ఫీచర్‌ ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌ లోని స్కామ్‌ డిటెక్షన్ ఫీచర్‌ కోసం సెర్చ్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ పబ్లిక్‌ బీటా వెర్షన్ అమెరికాలో విడుదల అవుతోంది. గూగుల్‌ పిక్సల్‌ 6 తోపాటు తర్వాత విడుదల అయిన గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఫీచర్‌ ను సపోర్టు చేస్తాయి. అయితే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌ లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు.

ఇటీవల ట్రాయ్‌ కూడా స్పామ్ కాల్స్‌ పైన చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ గత నెలలో స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ లను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ప్రత్యేక వ్యవస్థ ను తీసుకొచ్చింది. BSNL కూడా స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లపై చర్యలకు ప్రత్యేక ఫీచర్‌ ను ప్రకటన చేసింది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X