గుట్టువిప్పిన జపాన్.. అదే నిజమైతే?

Posted By: Staff

గుట్టువిప్పిన జపాన్.. అదే నిజమైతే?

 

జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ బ్లాగ్.. గూగుల్, సామ్‌సంగ్‌కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని బహిర్గతం చేసింది. ఈ బ్లాగ్ వెలువరించిన సమాచారం మేరకు గూగుల్ 10 అంగుళాల నెక్సస్ టాబ్లెట్‌ను వృద్ధి చేసేందుకు సామ్‌సంగ్‌తో  పని చేస్తోంది.  సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇప్పటికే  అసస్‌తో జతకట్టి నెక్సస్ 7 టాబ్లెట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టాబ్లెట్ ఫీచర్లకు సంబంధించి డేటాతో కూడిన చిత్రాన్ని ఈ బ్లాగ్ విడుదల చేసింది. ఈ లీకైన రిపోర్టులు ఆధారంగా  ‘గూగుల్ నెక్సస్ 10’ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు.....

- 10 అంగుళాల పెద్దదైన స్ర్కీన్ డిస్ ప్లే(రిసల్యూషన్  2560 x 1920పిక్సల్స్),

- 5 మెగా పిక్సల్  రేర్ కెమెరా,

- ఎక్సినోస్ 4 క్వాడ్ 5250 మొబైల్ ప్రాసెసర్,

- ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం.

గూగుల్ నెక్సస్ 7కు హై రేటింగ్:

దిగ్గజ సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్’ సపోర్ట్‌తో పనిచేసే నెక్సస్ 7 టాబ్లెట్‌ను గత జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అసస్‌చే డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను సులువుగా రిపేర్ చేసుకోవచ్చంటూ ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ఐఫిక్స్‌ఇట్ (iFixit) అదిరిపోయే రేటింగ్‌ను విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెట్జ్ టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బరువు 0.75 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (9.5గంటలు).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot