అంతలోనే ‘అపశకునం’..కమ్మేసిన నల్లటి పొగ!

Posted By: Staff

 అంతలోనే ‘అపశకునం’..కమ్మేసిన నల్లటి పొగ!

 

ఈ ఏడాది జూన్‌లో ఆవిష్కరించబడి జూలై నుంచి పలు దేశాల్లో లభ్యమవుతున్న 'గెలాక్సీ నెక్సస్ 7" ఇండియాలో  అందుబాటకు సంబంధించి సమయం సమీపించిన నేపధ్యంలో ఓ సంఘటన గూగుల్ అభిమానులను సందిగ్థంలోకి నెట్టింది. ఈ తొలి జెల్లీబీన్ టాబ్లెట్‌లో ఆకస్మాత్తుగా మంటల ఏర్పడని సంఘటన పలువురిని కలవర పెడుతోంది. వివరాల్లోకి వెళితే.... చైనాకు చెందిన  'హాంగ్_999999" అనే ఐడీ నెంబరు కలిగిన  యూజర్ తాను కొనుగోలు చేసిన  'నెక్సస్ 7"బ్యాటరీ భాగంలో యాదృచ్ఛికంగా దహనచర్య ఏర్పడిందని, ఈ క్రమంలో వెలువడిన నల్లటి పొగ తన రూమ్‌ను కమ్మేసిందని 'Baidu forum post"ద్వారా  ఫోటో ఫీచర్‌తో కూడిన వివరాలను అప్‌లోడ్ చేసి యావత్ గూగుల్ నెక్సస్ అభిమానులను షాక్‌కు గురిచేశాడు.

ఇండియాలో.......

భారతీయ ఆన్ లైన్ మార్కెట్లో గూగుల్ నెక్సస్ 7 విక్రయాలు  నవంబర్ 8 నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ  ఆన్‌లైన్ రిటైలర్ క్రోమా రిటైల్ స్టోర్, గూగుల్ నెక్సస్ 7ను రూ.19,981 ధరకు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సదుపాయాన్ని సైతం ఈ వెబ్‌సైట్ కల్పిస్తోంది. ఫీచర్లు: 7 అంగుళాల 10 పాయింట్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, క్వాడ్ కోర్ 1.2 ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కనెక్టువిటీ. ప్రత్యేకతలు: గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్స్, క్రోమ్ బ్రౌజర్

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot