Home
News

Google Pixel 8 సిరీస్‌ ఫోన్ల విడుదల తేదీ వెల్లడైంది.. స్పెసిఫికేషన్ల వివరాలు..!

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్‌ 12 విడుదల చేస్తామని ఆపిల్ సంస్థ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు పంపుతోంది. దీంతో గూగుల్‌ కూడా తన కొత్త ఫోన్ Google pixel 8 సిరీస్‌ విడుదల తేదీని ప్రకటన చేసింది. అక్టోబర్ 4న కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

మేడ్‌ బై గూగుల్‌ కార్యక్రమం గత సంవత్సరం మాదిరిగానే న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అక్టోబర్ 4 తేదీ 7:30 PM IST గంటలకు కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపింది. పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లతోపాటు పిక్సల్‌ వాచ్‌ 2ను విడుదల చేయనుంది.

Google announced pixel 8 series launch date

కొన్ని గంటల క్రితం పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ గూగుల్‌ వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. ఫోన్‌ వెనుక భాగం పింగాణీ రంగులో కనిపించింది. పిక్సల్‌ 8 సిరీస్‌ ఫోన్లు అదే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. కర్వడ్‌ డిస్‌ప్లేకు బదులుగా ప్రో మోడల్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

ప్రో మోడల్‌లోని కెమెరా విజర్‌ అన్ని లెన్స్‌లకు ఒకే కటౌట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఉష్ణోగ్రత సెన్సార్‌తో వస్తుంది. గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ ఫోన్లు మూడో జనరేషన్‌ Tensor G3 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 అవుట్‌ ఆఫ్ ది బాక్స్‌తో రానున్నాయి.

గూగుల్ 8 పిక్సల్‌ ఫోన్లు కొన్ని కెమెరా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. పిక్సల్‌ 8 సిరీస్‌లో కొత్త 50MP శాంసంగ్‌ ISOCELL GN2 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. పిక్సల్‌ 6, 7 సిరీస్‌లోని GN1 సెన్సార్‌ల కంటే ఇది 35 శాతం మెరుగైన పనితీరును కనబరుస్తుంది. పిక్సల్‌ 8 ప్రో 64MP అల్ట్రా వైడ్‌ సెన్సార్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.

గూగుల్‌ పిక్సల్ 8 స్మార్ట్‌ ఫోన్‌ 12.2MP వెర్షన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లు కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అతిగా కాంతి వెదజల్లకుండా, బోకే తీవ్రతను నియంత్రించేందుకు అడాప్టివ్‌ టార్క్‌ను కలిగి ఉంటుంది.

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే పిక్సల్‌ 8 ప్రో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది. పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు గత ఫోన్ల కంటే అధిక బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

పిక్సల్‌ 8 ఫోన్ 4,485mAh బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అదే పిక్సల్‌ 8 ప్రో 4,950mAh సామర్థ్యంతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు ఫాస్ట్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో వస్తాయి. పిక్సల్‌ 8 ఫోన్‌ 24W, పిక్సల్‌ 8 ప్రో ఫోన్‌ 27W ఛార్జింగ్ సపోర్టుతో రానున్నాయి. ఈ రెండు మోడళ్లు కూడా 20W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తాయి.

పిక్సల్‌ వాచ్‌ 2 వృత్తాకార డయిల్‌ డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. ముందు తరం వాచ్‌ మాదిరిగా పొడవైన బెజెల్స్‌తో రానుంది. 1.2 అంగుళాల వృత్తాకార OLED స్క్రీన్‌, 384*384 రిజల్యూషన్‌తో రానుంది. పిక్సల్‌ వాచ్‌ 2 స్నాప్‌డ్రాగన్‌ W5 చిప్‌, 306mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Wear OS 4పై పనిచేస్తుంది. డైనమిక్‌ థీమింగ్‌ సహా ఆటో అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. వైడ్‌బ్యాండ్‌ సామర్థ్యాలతో వస్తుంది.

ఆపిల్‌ తన నెక్ట్స్ జనరేషన్‌ ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 12 10:30PM గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ఆపిల్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంవత్సరంలో ఐఫోన్‌లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని అనేక వార్తలు వచ్చాయి. అయితే డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. అయితే ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో మోడళ్ల ధరలు భారీగా పెరుగుతాయని మరో వార్త వినిపిస్తోంది.

అయితే స్డాండర్డ, ప్లస్‌ వెర్షన్‌లు పాత ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది. అయితే లీక్‌ల ఆధారంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఐఫోన్‌ 15 స్మా్ర్ట్‌ఫోన్లు USB-C పోర్టును కలిగి ఉంటాయి. ఐఫోన్‌ 15 స్డాండర్డ్‌ మోడళ్లు A16 బయోనిక్‌ చిప్‌ను కలిగి ఉంటాయి. అదే ప్రో మోడళ్లు శక్తివంతమైన A17 బయోనిక్ చిప్‌తో రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google officially announced pixel 8 series smartphone launch date
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X