లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది పై గూగుల్ వేటు

మీటూ ఉద్యమం ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.తాజాగా గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను గత రెండేళ్ల కాలంలో తొలిగించినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

|

మీటూ ఉద్యమం ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.తాజాగా గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను గత రెండేళ్ల కాలంలో తొలిగించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులతో ఇంటర్‌నెట్‌ దిగ్గజం కాపాడిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించిన క్రమంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో సుందర్‌ పిచాయ్‌ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

ఫేస్‌బుక్ లో కొత్త ఫీచర్ మీకు నచ్చిన పాట పెట్టుకోవచ్చు !ఫేస్‌బుక్ లో కొత్త ఫీచర్ మీకు నచ్చిన పాట పెట్టుకోవచ్చు !

48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు....

48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు....

లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు కావడం గమనార్హం. ఈ ఉద్యోగులకు ఎలాంటి ఎగ్జిట్‌ ప్యాకేజ్‌ ఇవ్వలేదని పిచాయ్‌ పేర్కొన్నారు. సంస్ధలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే బాధితులు అంతర్గత వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈమెయిల్‌ పేర్కొంది.

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా....

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా....

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా మలిచేందుకు కృషి సాగిస్తామని, అసభ్యకరంగా వ్యవహరించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈమెయిల్‌ స్పష్టం చేసింది.

దేశాన్ని కుదిపేస్తున్న ‘Me Too’ ఎలా మొదలైంది....

దేశాన్ని కుదిపేస్తున్న ‘Me Too’ ఎలా మొదలైంది....

Me Too ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనూశ్రీ దత్తా, చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణల తర్వాత ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. తమపై జరిగిన లైంగికదాడుల గురించి నోరు విప్పుతున్నారు. దీంతో ఈ అంశం సినిమా రంగంతో పాటు జర్నలిజం, రాజకీయ, కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు #Me Too ఉద్యమం నేపథ్యం ఎలా మొదలైంది? వివరాలు మీ కోసం..

సోషల్ మీడియాలో #MeToo యాష్ ట్యాగ్‌తో....

సోషల్ మీడియాలో #MeToo యాష్ ట్యాగ్‌తో....

సోషల్ మీడియాలో #MeToo యాష్ ట్యాగ్‌తో అనేక ఉద్యమాలు ఏళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో ఎక్కువగా ఆత్మన్యూనత భావాన్ని ఎదుర్కోవడం, పరోపకారం తదితర అంశాలపైనే ఈ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఒక అంశాన్ని గురించి ప్రతిపాదిస్తూ.. అలాంటి అనుభవాలు, అభిరుచులు ఉన్న వ్యక్తుల అభిప్రాయాలు కోరుతూ మీటూ క్యాంపెయిన్ కొనసాగించారు.

పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్న మహిళలు....

పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్న మహిళలు....

కాలక్రమంగా ‘MeToo' ఉద్యమం లైంగిక వేధింపులపై ఒక శక్తివంతమైన వేదికగా మారింది. పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న మహిళలు ట్విటర్, ఫేస్‌బుక్ వేదికగా ఒక్కొక్కరుగా తమ గళం విప్పడం మొదలుపెట్టారు. అనతికాలంలో ఇలాంటి మహిళల సంఖ్య వేలకు చేరడం, మీటూ ప్రకంపనలు అన్ని రంగాలకు తాకడంతో ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయ అంశంగా మారింది.

 

 

Best Mobiles in India

English summary
Google On Firing 13 Senior Staff For Sex Harassment.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X