కొత్త సర్వీస్‌తో వెబ్ సైట్స్ 'స్లో' గా ఉండే ఇక చచ్చినట్లే..

Posted By: Staff

కొత్త సర్వీస్‌తో వెబ్ సైట్స్ 'స్లో' గా ఉండే ఇక చచ్చినట్లే..

బెంగళూరు: వెబ్ సెర్ట్ గెయింట్ గూగుల్ రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటుంది. యూజర్స్ యొక్క వెబ్‌పేజీల స్పీడ్‌ని పెంచేందుకుగాను 'పేజీ స్పీడ్ సర్వీస్' అనే ఆన్ లైన్ సర్వీస్‌ని ప్రవేశపెట్టింది. దీని ఉపయోగం ఏమిటంటే యూజర్స్ యొక్క వెబ్‌పేజీల స్పీడ్‌ని ఆటోమేటిక్‌గా పెంచడం జరగుతుంది. గూగుల్ ఇంజనీర్స్ చెప్పిన వివరాల ప్రకారం కొత్తగా ప్రారంభించిన పేజి స్పీడ్ సర్వీస్ వల్ల గతంలో పేజి లోడ్ అయ్యే శాతం 25 కాగా అది ఇప్పుడు 60 శాతానికి పెరిగింది.

బెంగుళూరులో గూగల్ ఇంజనీరింగ్ టీమ్ మేనేజర్ రామ్ రమానీ మాట్లాడుతూ యూజర్స్ ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోవాలంటే గూగుల్ డిఎన్‌ఎస్ ఎంట్రీ ద్వారా సైన్ అప్ అవ్వాలని అన్నారు. దీంతో మీ సర్వర్స్‌లోని కంటెంట్‌ ఉన్న పేజిలను తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ యూజర్స్‌కు గూగుల్ సర్వర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. గతంలో మాదిరే యాజర్స్ వెబ్‌సైట్స్‌ని యాక్సెస్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం వెబ్‌పేజిలు చాలా ఫాస్ట్‌గా రన్ అవడం జరుగుతుందని తెలియజేశారు. గూగుల్ అందించేటటువంటి ఈ కొత్త సర్వీస్ వల్ల యూజర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రస్తుతం ఈసర్వీస్‌ని కొంత మంది వెబ్ సైట్ ఓనర్స్‌కే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం చివరికల్లా మిగిలిన వెబ్‌సైట్ ఓనర్స్‌కి అందించడం జరుగుతుంది. గూగుల్ పేజి స్పీడ్ సర్వీస్ అనేది ఉచిత సర్వీస్. గూగుల్ ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త సర్వీస్ గురించి తెలిసుకోవాలనుకుంటే గూగుల్ వెబ్ ఫామ్ ద్వారా రిజస్టర్ అయి సర్వీస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot