Home
News

లైంగిక ఆరోపణలతో రూ.315 కోట్లు వదిలించుకున్న గూగుల్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. దుష్ప్రవర్తన కలిగిన ఓ భారత ఉద్యోగిని కోట్లాది రూపాయలిచ్చి వదిలించుకున్నది. ఏకంగా 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.315 కోట్లు) చెల్లించిం ది. లైంగిక వేధింపుల ఆరోపణలపై 2016లో అమి

టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. దుష్ప్రవర్తన కలిగిన ఓ భారత ఉద్యోగిని కోట్లాది రూపాయలిచ్చి వదిలించుకున్నది. ఏకంగా 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.315 కోట్లు) చెల్లించిం ది. లైంగిక వేధింపుల ఆరోపణలపై 2016లో అమిత్ సింఘాల్ రాజీనామా చేయగా, సంస్థ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయనకు ఈ మొత్తాన్ని గూగుల్ ఇస్తామని అంగీకరించింది.

లైంగిక ఆరోపణలతో రూ.315 కోట్లు వదిలించుకున్న గూగుల్

ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సింఘాల్‌పై 2016లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్‌లో సింఘాల్ గతంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు.

రాజీనామా చేసిన సమయంలో

రాజీనామా చేసిన సమయంలో

ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సమయంలో ఆయనతో కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో ఎంతసొమ్ము ఇస్తారన్నది వెల్లడి కాలేదు. ఐతే సోమవారం ఇందుకు సంబంధించిన ప్యాకేజీ సొమ్ము వివరాలు వెలుగుచూశాయి.

భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని..

భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని..

ఈ వ్యవహారంలో నిందితుడిని శిక్షించాల్సిందిపోయి భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఓ వాటాదారు కోర్టును ఆశ్రయించడంతో ప్యాకేజీ విషయం బయటకు వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని

భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని

కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో ఈ లాసూట్ గత జనవరిలో ఫైల్ అయింది. లైంగిక వేధింపుల కేసులో గూగుల్ యాజమాన్యం వ్యవహార శైలిని పిటిషనర్ తప్పుపట్టారు. కాగా సింఘాల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపిన గూగుల్ ఆ సమయంలో ఆయన మద్యం సేవించివున్నారని నిర్ధారించింది

కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని

కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని

అలాగే ఆయన ఉద్యోగిగా ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొంది. కానీ ఆ సమయంలో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్న సింఘాల్ రాజీనామా చేశారు.

5 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని

5 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని

కాగా ఆయన పనిచేసిన రెండేళ్ల కాలానికి 15 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఈ సందర్భంగా అంగీకరించింది. ఇక్కడి నుంచి వైదొలిగిన సంవత్సరం తర్వాత ఊబర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు సింఘాల్ అంగీకరించారు. అయితే మూడో ఏడాదికి మాత్రం పరిహారం చెల్లించేందుకు గూగుల్ అంగీకరించలేదు.

ఊబర్‌లో

ఊబర్‌లో

2016 వరకు గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్‌ను సీనియర్ ఉపాధ్యక్షుడి హోదాలో సింఘాల్ చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గూగుల్ నుంచి ఊబర్‌లో చేరిన సింఘాల్.. అక్కడ కూడా రాజీనామా చేయగా, దానికి కారణం గూగుల్ లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగు చూడటమే.

ఈ వ్యవహారంపై స్పందించేందుకు

ఈ వ్యవహారంపై స్పందించేందుకు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ కి చెందిన సింఘాల్.. ఐఐటీ రూర్కీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకున్నారు. మిన్నెసోటా డులుత్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ డిగ్రీనీ పొందారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించేందుకు సింఘాల్ నిరాకరించారు.

Best Mobiles in India

English summary
Google paid USD 45 million to its former India-born executive accused of sexual misconduct
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X