Google పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్ ద్వారా లీకైన పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం ఎలా?

|

ఈ డిజిటల్ యుగంలో మీ డేటా సురక్షితంగా ఉందో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన వాటితో సహా మీరు ఉపయోగించే అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి ఒక్కటి మీ వ్యక్తిగత వివరాలను లీక్ చేసే అవకాశం ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్లలో ఒకటి గూగుల్. ఇది ఆటోఫిల్ కోసం మీ పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సమాచారాన్ని సేవ్ చేస్తుంది. అయితే మీ యొక్క పాస్ వర్డ్ వివరాలు Google చేతిలో సురక్షితంగా ఉన్నాయో లేదో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Google పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్

Google పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్

** గూగుల్ ఆన్‌లైన్ ప్రొటెక్షన్ ను బలోపేతం చేయడానికి 'పాస్‌వర్డ్ చెక్-అప్' అనే ఫ్రీ యాడ్-ఆన్ ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఫీచర్‌తో మీరు బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించవచ్చు మరియు మీరు బలహీనమైన పాస్‌వర్డ్‌ను సృష్టించినప్పుడల్లా మీకు అలర్ట్ వస్తుంది. ఈ టూల్ మీకు పాస్‌వర్డ్‌ల యొక్క మూడు అంశాలను తెలియజేస్తుంది.


** ముందుగా మీరు తిరిగి ఉపయోగించిన పాస్‌వర్డ్‌లను వాడినట్లయితే అది చూపబడుతుంది. అప్పుడు అది బలహీనమైన పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న మీ గూగుల్ అకౌంటులను చూపుతుంది. ఇవి కాకుండా అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీ పాస్‌వర్డ్ హ్యాక్ చేయబడిందా లేదా అని మీకు తెలియజేస్తుంది.

** పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్ తో మీరు మీ గూగుల్ అకౌంటుకు లింక్ చేయబడిన అన్ని యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లను కనుగొనగలరు. ప్రతి యాప్ లేదా వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌ని మార్చడానికి లేదా ఎడిట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే మీ యూజర్ సమాచారాన్ని అందించడం ద్వారా మరియు డిలీట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని తొలగించవచ్చు. ముఖ్యంగా మీరు మీ ఏదైనా గూగుల్ అకౌంటుల కోసం పాస్‌వర్డ్‌ను సేవ్ చేసినట్లయితే మాత్రమే ఇది పని చేస్తుంది.

 

పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్ ని ఎలా ఉపయోగించాలి

పాస్‌వర్డ్ చెక్-అప్ టూల్ ని ఎలా ఉపయోగించాలి

మీ పాస్‌వర్డ్ లీక్ అయ్యిందో లేదో తనిఖీ చేయడానికి కింద ఇచ్చిన దశలను అనుసరించండి.

స్టెప్ 1: మొదటగా password.google.com ని ఓపెన్ చేసి పాస్‌వర్డ్ మేనేజర్‌కి వెళ్లండి.

స్టెప్ 2: పాస్‌వర్డ్ మేనేజర్‌లో పాస్‌వర్డ్‌ను చెక్ చేసే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

స్టెప్ 3: మీరు ఆ సిస్టమ్‌లో లాగిన్ అయిన తరువాత Gmail పాస్‌వర్డ్‌ను గూగుల్ అడుగుతుంది.

స్టెప్ 4: ఇప్పుడు మీ ఆన్‌లైన్ ఆధారాలు లీక్ అయ్యాయని మరియు ఎక్కడైనా ఉపయోగించబడిందా లేదా అని గూగుల్ మీకు తెలియజేస్తుంది.

 

లీక్ అయిన పాస్‌వర్డ్‌ను తనిఖీ చేసే విధానం

లీక్ అయిన పాస్‌వర్డ్‌ను తనిఖీ చేసే విధానం

స్టెప్ 1: మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ -> సిస్టమ్ -> లాంగ్వేజ్స్& ఇన్‌పుట్‌ విభాగానికి వెళ్లండి.

స్టెప్ 2: అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆటోఫిల్ కోసం శోధించండి మరియు దాని మీద నొక్కండి.

స్టెప్ 4: గూగుల్ సర్వీసుల కోసం సెట్టింగ్ ప్రారంభించబడిందని నిర్ధారించుకోవడానికి గూగుల్ పై క్లిక్ చేయండి.

 

బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించడం ఎలా?

బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించడం ఎలా?

మీ యొక్క సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అవ్వకుండా చూసుకోవడానికి మీ యొక్క అకౌంటులకు బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించడం ముఖ్యం. ఇందుకోసం ముందుగా మీరు మీ పాస్‌వర్డ్ ను రాజీ పడకుండా నిరోధించాలి. దీని కోసం పాస్‌వర్డ్‌లో ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు మరియు చిన్న అక్షరాలు మరియు సంఖ్యల కలయిక ఉండాలి. మీ అన్ని అకౌంటులకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగించబడలేదని నిర్ధారించుకోండి. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ కోసం నెట్‌బ్యాంకింగ్‌ను సృష్టించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.


మీరు ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అకౌంటును సృష్టించినప్పుడు హ్యాకర్ల నుండి అదనపు భద్రత కోసం మీరు రెండు-దశల ధృవీకరణను ప్రారంభించినట్లు నిర్ధారించుకోండి. అలాగే ఇవి సురక్షితం కానందున పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయకపోవడం ఉత్తమం. డేటా నష్టం జరిగితే అదనపు బ్యాకప్ కోసం మీ డేటాను గూగుల్ డ్రైవ్ లేదా ఇతర సర్వీసుల వంటి క్లౌడ్ సర్వీసుల్లో సేవ్ చేసుకోండి.

 

Best Mobiles in India

English summary
Google Password Check-Up Tool: How To Check Leaked Passwords

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X