Google Pay ద్వారా RS.1,000లు పొందవచ్చు ఎలాగో తెలుసుకోండి!!

|

ఇండియా మార్కెట్లో కొత్తగా ప్రమోషనల్ ఫీచర్లను ప్రవేశపెట్టడానికి గూగుల్ నిరంతరం కృషి చేస్తోంది. గతంలో కూడా ఈ సంస్థ అనేక ప్రయత్నాల ద్వారా వినియోగదారులు కొంత అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం ఇవ్వడానికి అనేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్లో గూగుల్ ఇటీవల తన దీపావళి ఆఫర్‌ను విడుదల చేసింది.

దీపావళి ఆఫర్‌
 

దీపావళి ఆఫర్‌లో భాగంగా గూగుల్ పే వినియోగదారులను వేర్వేరు స్టాంపులను సేకరించమని కంపెనీ కోరింది. ఈ స్టాంపులను సాంప్రదాయ దీపావళికి సంబంధించిన వస్తువులతో లేబుల్ చేశారు. ఈ వస్తువులలో డియా, రంగోలి, ఝంకా, ఫ్లవర్ మరియు లాంటర్న్స్ ఉన్నాయి.

‘లోకల్ గైడ్స్' పేరుతో గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్

గూగుల్ పే

ఈ స్టాంపులన్నింటినీ సేకరించినట్లయితే కంపెనీ వినియోగదారులకు రూ.251లు బహుమతిగా ఇచ్చింది. వినియోగదారులు బిల్లులు లేదా ఇతర చెల్లింపులను చెల్లించడానికి ఈ యాప్ ను ఉపయోగించినట్లయితే మాత్రమే ఈ స్టాంపులను సేకరించగలిగారు. గూగుల్ పే సంస్థ ఇప్పుడు కొత్త ప్రచార కార్యక్రమాన్ని స్క్రాచ్ కార్డుల రూపంలో ప్రారంభించింది దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ పేలో బంగారాన్ని మార్చుకొనే క్రొత్త ఫీచర్‌ దీనిపై ఓ లుక్ వేయండి

గూగుల్ పే ఆన్ ఎయిర్ ఫీచర్: స్క్రాచ్ కార్డులను ఎలా పొందాలి

గూగుల్ పే ఆన్ ఎయిర్ ఫీచర్: స్క్రాచ్ కార్డులను ఎలా పొందాలి

కొత్త ఆఫర్ ప్రకారం సంస్థ యొక్క ప్రమోషన్ల విభాగంలో కొత్తగా "ఆన్-ఎయిర్" బటన్‌ను జోడించింది. గూగుల్ ప్రకారం ఈ కొత్త ఆన్-ఎయిర్ ప్రమోషనల్ ఆఫర్ ఆడియో ఆఫర్‌లో ఒక భాగం. గూగుల్ పే యూజర్లు యూట్యూబ్ లేదా టెలివిజన్‌లో ఏదైనా గూగుల్ పే ప్రకటనను చూసినట్లు అయితే ఈ విభాగాన్ని ఓపెన్ చేయవచ్చు. గూగుల్ పే యాప్ ఈ ప్రకటనను విన్న తరువాత మీకు స్క్రాచ్ కార్డును అందిస్తుంది. మీరు "రివార్డ్స్" విభాగంలో స్క్రాచ్ కార్డును యాక్సెస్ చేయవచ్చు.

ఆపిల్,స్పాటిఫై లకు పోటీగా టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమ్ యాప్

 స్క్రాచ్ కార్డు
 

అయితే ఈ కొత్త స్క్రాచ్ కార్డు ఒక ముఖ్య గమనికతో వస్తుంది. ఈ స్క్రాచ్ కార్డ్ లాక్ చేయబడి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దాన్ని అన్లాక్ చేయడానికి ఈ యాప్ ను ఉపయోగించవలసి ఉంటుంది. వినియోగదారులు తమ స్నేహితులకు కొంత డబ్బు పంపడం ద్వారా స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేయవచ్చు. రెండవ స్క్రాచ్ కార్డ్ అన్లాక్ చేయడానికి వినియోగదారులను ఏదైనా వ్యాపారికి డబ్బును చెల్లించమని అడుగుతుంది. దీపావళి ఆఫర్ మాదిరిగానే ఈ ఆఫర్ వినియోగదారులు గూగుల్ పే యాప్‌ను ఉపయోగించడం ద్వారా స్క్రాచ్ కార్డ్ అన్‌లాక్ చేయబడుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండి

గూగుల్

ఆన్‌లైన్‌లో లభించే సమాచారం ప్రకారం రూ.10 నుంచి రూ.1,000లను పంపడం ద్వారా స్క్రాచ్ కార్డ్ రివార్డు ;లభిస్తున్నట్లు గూగుల్ హామీ ఇస్తుంది. ఈ గూగుల్ ఇండియా ప్లేజాబితా నుండి వినియోగదారులు ఈ స్క్రాచ్ కార్డులను పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. యాప్ "ఆన్-ఎయిర్" టాబ్‌లోని ఆడియోను మాత్రమే వింటుందని గూగుల్ స్పష్టం చేసింది. అదనంగా ఈ ఆడియో డేటా ఎప్పుడూ మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఈ ప్రచార ఆఫర్ డిసెంబర్ 2, 2019 న 11:59 PM కి ముగుస్తుంది కావున త్వరపడండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pay Scratch Cards Available Up To Rs. 1,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X